టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్ విసిరారు. మీరు హెరిటేజ్ ఆస్తులు పేదలకు పంచుతారా?.. అలా చేస్తే నేను కొనుగోలు చేసిన భూములు కూడా పంచేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తనది సంపన్న కుటుంబమని.. తాను భూములు కొంటే తప్పా అంటూ మంత్రి ప్రశ్నించారు.
చట్టం ప్రశ్నించినపుడు ఎవరైనా సిద్ధపడాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సీఎం జగన్ కేసుల వెనుక రాజీయ ప్రేరేపితం ఉందని ప్రజలు తెలుసుకున్నారని.. చంద్రబాబు లాగా కేసుల గురించి జగన్ కన్నీళ్లు పెట్టుకోలేదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ప్రధానమైనదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా.. మంచి నిర్ణయాలను, కార్యక్రమాలను సమర్ధిస్తామన్నారు. కానీ ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవికి ప్రేమ వివాహం జరిపించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శవంతంగా నిలిచింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. చంద్రబాబు బాగోతం కొద్దీ రోజులుగా బయట పడుతోందని .. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా ఆయన దొంగలా తిరుగుతున్నారని ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు.
మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ టమాటాలు కొనే నాథుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుది మాటల ప్రభుత్వమన్న మంత్రి రోజా.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు.
హోంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నం పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గత 17 ఏండ్లుగా హోంగార్డ్ గా పనిచేస్తున్న రవీందర్ (35) ఆత్మహత్యాయత్నం ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాననన్నారు. breaking news, latest news, telugu news, big news, kishan reddy, cm kcr
వైద్యుడిని దేవుడితో పోలుస్తాం. దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ ఆ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడతాడు. అందుకే సమాజంలో వైద్యులకు విశేష ప్రాధాన్యత కట్టబెట్టారు.