Elephant Death: పండు అనుకుని నాటుబాంబు కొరికిన గజరాజు.. నొప్పి భరించలేక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephant Death: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటుబాంబు పేలి మృతి చెందిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. పండు అనుకుని ఆ ఏనుగు నాటుబాంబును కొరికింది. ఏనుగు కొరికిన వెంటనే ఆ బాంబు నోటిలోనే పేలింది. తీవ్రమైన రక్తం స్రావంతో రోడ్డుమీద సహాయం కోసం పెద్ద ఎత్తున ఆరుస్తూ ఆర్తనాదాలు చేసింది. కోయంబత్తూరు ఊటి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాటుబాంబు నోటిలో పేలడంతో ఏమీ తినలేక ఆకలితో ఆ ఏనుగు ప్రాణాలు విడిచింది.
అడవి పందులు తమ పొలాల్లోకి రాకుండా నిరోధించడానికి అవుత్తుకై అని పిలిచే నాటుబాంబును ఇక్కడి స్థానికులు పండ్లు , కూరగాయాలలో పెట్టి వుంచుతారు. ఏదైనా జంతువు దానిని కొరికినప్పుడు అది పేలి.. జంతువు నోటికి గాయాలవుతాయి. ఈ నేపథ్యంలో తడగాం అటవీ రేంజ్‌లోని ఇటుక బట్టీ సమీపంలో ఏనుగు సంచరిస్తోందని స్థానికులు అటవీ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అడవి పందుల కోసం వేటగాళ్లు పండుతో కలిపి కట్టినా నాటు బాంబు తినడంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది. గజరాజు ఆ ప్రాంతంలో తిరిగిన వీడియోలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. తొండం నుంచి రక్తం కారుతుండడంతో ఆ గజరాజు రోడ్డు మీద సాయం కోసం తిరుగుతూనే ఉంది.
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
Also Read: King Cobra: ఇంట్లోకి కింగ్ కోబ్రా, చాకచక్యంగా పట్టుకున్న క్యాచర్.. వీడియో ఇదిగో!
సమాచారం అందుకున్న అధికారులు, పశువైద్య బృందం ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయంతో బాధపడుతున్న ఏనుగుకు ఇంట్రావీనస్ మందులు, గ్లూకోజ్ అందించారు. ఈ క్రమంలో నిషేధిత అవుట్టుకై’ అనే నాటు బాంబును ఏనుగు కొరికినట్లుగా పశువైద్య బృందం గుర్తించింది. ఇటీవలే కేరళ నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏనుగు ఈ బాంబును ఎక్కడ కొరికిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. చివరకు నొప్పి భరించలేక ఏనుగు మృతి చెందింది.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!