బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులపై పురందేశ్వరి కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో భారీగా జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 15 నుంచి 17 జిల్లాల్లో బీజేపీ అధ్యక్ష స్థానాలు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో గచ్చిబౌలి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) రోడ్డులో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉం breaking news, latest news, telugu news, big news, Traffic Restrictions, Jhon Sena
మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే వెంటనే సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్లలో పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో యాపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది.
చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. 600 హామీలు ఇచ్చి చేసిన మోసం పై సమాధానం చెప్పండని.. అవినీతి చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని అవినాష్ అన్నారు.
దేశ రాజధానిలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.
తిరుమలలో ఉదయం శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగం నిర్వహించారు. ఆచార్య రుత్విక్ నేపథ్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.