floods: గోరుచుట్టు మీద రోకలి పోటు అనేలా వుంది లిబియా పరిస్థితి. ఓ వైపు వరదలు డెర్నా నగరంలో అల్లకల్లోలం సృష్టించాయి . ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం మరియు భవనాల కింద, శకలాల కింద చిక్కుకున్న వాళ్ళ కోసం సహాయక చర్యలు చేపట్టిన లిబియాకి పేలుడు పదార్ధాల భయం పట్టుకుంది. ప్రస్తుతం వరద కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటె ప్రస్తుతం అక్కడి అధికారులని పేలుడు పదార్ధాల భయం వెంటాడుతుంది.
వివరాల లోకి వెళ్తే.. 2011 వ సంవత్సరం నుండి లిబియాలో అంతర్గత గొడవలు జారుతున్నాయి. దీనితో అక్కడ మందు పాత్రలను పాతిపెట్టినట్టు అధికారులకి తెలిసింది. అంతే కాదు అంతర్జాతీయ విశ్లేషకుల సమాచారం ప్రకారం రెండో ప్రపంచ యుద్ధం నాటి మందు పాత్రలు కూడా లిబియాలో ఉన్నాయి. ఈ మధ్య సంభవించిన వరదలకు ఆ మందు పాత్రలు కొట్టుకుని వచ్చి ఉండొచ్చని.. సహాయక చర్యలు చేపట్టినప్పుడు అవి పొరపాటున పేలితే భారీ ప్రాణ నష్టం జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా సంభవించిన వరదల కారణముగా లిబియా లోని డెర్నా నగరం అస్తవ్యస్తం అయింది. ఆ వరద ధాటికి వేలల్లో ప్రాణనష్టం జరిగింది. గురువారం రోజుకి 11,300 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 10,100 మంది గల్లంతయ్యారు.. కాగా ఇంకా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. గల్లంతయిన వారంతా మరణించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. నగరంలో వరదకి కొట్టుకు వచ్చిన బురదంత మేటలు పెట్టింది. ఆ బురద మేటలు తొలిగించే సమయంలో మేటలకింద మృతదేహాలు కుప్పలు తిప్పలుగ కనిపిస్తున్నాయి. దీనితో శుక్రవారం నగరాన్ని మూసివేసిన ధికారులు అక్కడి ప్రజలను బయటకి పంపారు. కాగా సహాయక బృందాలు బురద మేటలను త్వరగా తొలిగించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
Libya: వరద బాధితులకి సహాయక చర్యలు.. భయపెడుతున్న పేలుడు పదార్థాలు