2026 సంక్రాంతి సినిమాల సందడి మోడలింది.. ఈ రేసులో మొత్తం 5 స్ట్రయిట్ తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. వాటిలో ముందుగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ జనవరి 9న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తోలిఆట నుండి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ సీన్స్ ను ఎడిటింగ్ లో తీసేయడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. కానీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ గట్టిగా రాబడుతోంది రాజాసాబ్.
Also Read : Dulquer Salmaan : మూడు భారీ ప్లాప్స్ నుండి దుల్కర్ సల్మాన్ గ్రేట్ ఎస్కేప్
ఇక మెగాస్టార్ చిరు నటించిన మన శంకర వరప్రసాద్ నిన్న రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి మార్క్ స్థాయిలో కామెడీ లేకున్నా కొంత మేర నవ్వించాడు. వింటేజ్ చిరును గుర్తుకుతెచ్చేలా సీన్స్ తో నింపిన దర్శకుడు ఫ్యాన్స్ వరకు విజువల్ ట్రీట్ అందించాడనే టాక్ తెచ్చుకుంది. అటు బుకింగ్స్ పరంగాను మన శంకర వరప్రసాద్ అదరగొడుతుంది. చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతానికి అయితే విడుదలైన రెండు సినిమాలలో రాజాసాబ్ కంటే మనశంకరవరప్రసాద్ లీడ్ లో ఉంది. ఇక రాబోయే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు, శర్వానంద్ నారినారి నడుమ మురారి సినిమాలు ఎలాంటి టాక్ తెచుకుంటాయో ఎలాంటి వసూళ్లు రాబడతాయో ఈ సంక్రాంతికి అసలు విన్నర్ ఎవరో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.