Kerala: ఎన్‌సీఆర్‌బీ పేరుతో యువకుడికి ఫేక్ మెసేజ్.. భయంతో విద్యార్థి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఓ విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌సీఆర్‌బీ పేరుతో ఫేక్ మెసేజ్ రావడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి వయసు 16 ఏళ్లు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) పేరుతో ఫేక్ మెసేజ్ రావడంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనధికార మూవీ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసేందుకు ఆ యువకుడు ప్రయత్నించినట్లు, ఆ సైట్ పేమెంట్ చేయాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Afghanistan: ఇండియాలో ఆఫ్ఘాన్ ఎంబసీ మూసివేత.. యూకే, యూఎస్ఏలకు దౌత్యవేత్తలు..
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
అసలేం జరిగిందంటే.. కోజికోడ్‌లోని ఓ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న ఆదినాథ్ బుధవారం సాయంత్రం చెవాయూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆదినాథ్ గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో ఆన్‌లైన్‌లో మోసపోయినట్లు అందులో ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తల్లిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్‌లో, తాను ఏ అనధికార వెబ్‌సైట్‌కి లాగిన్ చేయలేదని, అయితే తన ల్యాప్‌టాప్‌లో చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లో సినిమా చూశానని ఆదినాథ్ పేర్కొన్నారని పోలీసు అధికారి తెలిపారు.
Also Read: Uniform Civil Code: స్వలింగ వివాహం యూసీసీ పరిధిలోకి రాదు..!
ల్యాప్‌టాప్‌లో అనధికార వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం వల్ల అతనికి రూ.30 వేలు కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌సీఆర్‌బీ పేరుతో నకిలీ సందేశం వచ్చింది. అలా చేయని పక్షంలో భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారని ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో విద్యార్థి ఆదినాథ్‌కు భయం వేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ల్యాప్‌టాప్ బ్రౌజర్ హిస్టరీని పరిశీలించగా, చనిపోయిన విద్యార్థి ఏ అక్రమ వెబ్‌సైట్‌ను తెరిచినట్లు కనిపించలేదని ఓ పోలీసు అధికారి అన్నారు. “బ్రౌజర్ చరిత్ర తొలగించబడిందో లేదో మాకు తెలియదు, కానీ నిజం బయటకు తీసుకురావడానికి దర్యాప్తు అవసరం.’ అని ఆయన చెప్పారు. ఇప్పటికే విచారణ ప్రారంభించామని, త్వరలో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి సమాచారం సేకరిస్తామని పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు వేరే ఇంటికి మారారని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!