సినీ నటుడు శ్రీ తేజపై భార్య సంచలన ఆరోపణలు
సినీ నటుడు శ్రీ తేజ్ పెళ్లి పేరుతో అమ్మాయి లను ట్రాప్ చేస్తున్నాడని ఓ యువతీ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగదీసుకొని 20 లక్షలు డబ్బులు కాజేశాడని సదురు యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయిన మరో మహిళను ట్రాప్ చేసాడు. భార్య తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తో ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ గుండె పోటు తో మరణించాడు. ఆ ఘటన లోను శ్రీ తేజ్ పై మాదాపూర్ లో కేసు నమోదయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నాడు శ్రీ తేజ్. శ్రీతేజ్ పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేసారు పోలీసులు.
కాల్చిన శనగపప్పు తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ బర్వాలా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుటుంబంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పరిస్థితి విషమంగా మారింది. అయితే.. అందరూ తోపుడు బండిపై విక్రయిస్తున్న కాల్చిన వేరుశనగ పప్పులు కొని తిన్నారని, ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 24 సాయంత్రం బాధిత కుటుంబం మార్కెట్‌లోని బండిపై కాల్చిన శెనగల పప్పు తీసుకొచ్చారు. ఇంట్లో వండిన ఆహారంతోపాటు కలిపి తిన్నారు. ఆ తర్వాత 50 ఏళ్ల వృద్ధుడు, ఇంటి యజమాని కలువా సింగ్, 8 ఏళ్ల అమాయక మనవడు లావిష్ సోమవారం ఉదయం మరణించారు. కోడలు జోగేంద్రి మంగళవారం చికిత్స పొందుతూ.. మృతి చెందింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సోమవారం ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించకుండానే బంధువులు దహనం చేశారు.
‘‘మీరు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లా..?’’ కేఏ పాల్ పిటిషన్‌పై ఆగ్రహం..
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలాలే ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఈవీఎం ట్యాపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వస్తాయా… అని ప్రశ్నించింది. ‘‘మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు, ఈవీఎం ట్యాపరింగ్ కావు. మీరు ఓడిపోయినప్పుడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడుతాయా’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బ్యాలెట్ పేపర్‌ని మళ్లీ ప్రవేశపెట్టడం తప్పని సరి అని, ఈవీఎం ట్యాంపరింగ్‌కి గురయ్యే అవకాశం ఉందని పిటిషన్ కేఏ పాల్ తన పిటిషన్‌లో తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారని ఆయన పేర్కొన్నాడు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే ఎలాన్ మస్క్ వాదనని కేఏ పాల్ ఉదహరించారు.
మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత
హైదరాబాద్ నగరం రోజురోజుకి మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా అని అనిపిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి నగర పోలీసులు, ఎస్టిఎఫ్ పోలీసులు దాడుల నేపథ్యంలో పబ్బులు, ప్రవేట్ పార్టీలలో పెద్ద సంఖ్యలో ఈ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. మరోవైపు కొందరు గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ కావాలంటే కేవలం ఫోన్ చేస్తే చాలు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి డెలివరీ చేసేలా సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి హైదరాబాద్ మహానగరంలో మత్తు పదార్థాలు దొరికాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. గంజాయి, ఎండిఎంఎ, ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్ ఏది కావాలన్నా ఇస్తామని కస్టమర్లకు ఫోన్లు చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు జరిపే ముఠాను మంగళవారం ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. గోల్కండ ఎక్సైజ్ పోలీస్ పరిధిలోని షేక్‌పేట్, టోలీ చౌక్ ప్రాంతాల్లో కార్లలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టిఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక కారులో ఒక యువతి, ఒక వ్యక్తి కూర్చోని ఉన్నారు. మరో వ్యక్తి స్కూటీపై వచ్చి గంజాయి ప్యాకెట్‌ను కారులో ఉన్న వ్యక్తులకు ఇస్తూ ఉండగా.. ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్కూటీపై వచ్చిన వ్యక్తి వద్ద నుంచి ఒక కిలో గంజాయి స్వాధీనం చేసుకున్న, అనంతరం కారులో తనిఖీలు నిర్వహించగా అందులో 1.7 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దింతో మొత్తంగా 2.7 కిలోల గంజాయి, 11గ్రాముల ఎండిఎంఎ, 3 ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్ లభించాయి.
రైల్వే మంత్రితో ముగిసిన పవన్ భేటీ.. పిఠాపురంలో పలు అభివృద్ధి పనులపై చర్చ
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రైల్వే శాఖ మంత్రితో విశాఖ రైల్వే జోన్ గురించి చర్చించినట్లు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. దేశంలో ఎన్నో కొత్త రైలు వస్తున్నాయని.. పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని రైల్వే మంత్రికి తెలిపారు. “శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయానికి భక్తులు వస్తారని మంత్రికి వివరించాను. పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లను అక్కడ ఆపాలని రైల్వే శాఖ మంత్రిని కోరాను. మంత్రి సానుకూలంగా స్పందించారు. పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కోరకు విజ్ఞప్తి చేశాం. పీఎం గతి శక్తి కింద ఇచ్చేలా ప్రాసెస్ చేస్తామని చెప్పారు.” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
రఘు రామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో.. అడిషనల్ ఎస్పీ అరెస్ట్‌కు సన్నాహాలు
సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ దిశగా పోలీసులు చర్యలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయపాల్ ను పోలీసులు విచారించారు. ఆయన రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. గత విచారణలో విజయపాల్‌ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు.. తెలియదు.. మర్చిపోయాను అంటూ సమాధానమిచ్చారు. రెవెన్యూ అధికారులు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విజయపాల్ కి ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ అరెస్ట్ కి సన్నాహాలు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ ‘‘పౌరసత్వం’’ రద్దు చేయాలని పిటిషన్..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు అలహాబాద్ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది. రాహుల్ గాంధీపై సీబీఐ విచారణ జరపాలని న్యాయవాది, బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆధారాలు ఉన్నట్లు పిటిషనర్ ఆరోపించారు. గతంలో వీఎస్ఎస్ శర్మ చేసిన విచారణలో యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన ఈమెయిళ్లను ఉదహరించారు.
చంద్రబాబు కీలక నిర్ణయం.. స్టార్టప్‌లకు రూ. 25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్..
నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామని చెప్పారు. 2029 నాటికి రూ. 5 లక్షల వర్క్ స్టేషన్లు పెట్టనున్నట్లు తెలిపారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మాణం, యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఉందని తెలిపారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సూచించారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఐఐటీలతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐదు జోనల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర.. ఇలా ఐదు ప్రాంతాల్లో జోనల్‌హబ్‌లకు కేంద్రంగా అమరావతి మారనుందన్నారు.
ఫాన్సీ నెంబర్లకు పెరుగుతున్న క్రేజ్.. ఒక్కరోజులో 52 లక్షల పైచిలుకు బిడ్
ప్రతిరోజూ మార్కెట్లోకి విభిన్న ఫీచర్లతో ఉన్న వాహనాలు ప్రవేశిస్తున్నాయి. కొందరు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన వాహనం ప్రత్యేకంగా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబరును కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎంతైనా సరే, ఇష్టమైన వాహనానికి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడంలో వెనుకాడరు. ఇందుకోసం వేలంపాటలో పాల్గొని ప్రత్యేక నంబర్లు పొందుతారు. ఈ ఉత్సాహం రవాణా శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ లో ఫాన్సీ నెంబర్ లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది.. ఖైరతాబాద్ ఆర్టిఏ పరిధిలో ఒక్కరోజులో 52 లక్షల 52 వేల 283 రూపాయల బిడ్ పలికింది..
అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది
అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, పేమెంట్ సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మిల్లులకు ధాన్యం కోసం లారీల ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సన్నరకం పండించిన రైతులకు బోనస్ గా 500 రూపాయలు ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గిట్టుబాటుధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో ఈ ప్రజా ప్రభుత్వం అన్ని పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసిందని, రాష్ట్రంలో 66లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారన్నారు.