ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు.
బీహార్‌లో ముస్లిం సమాజంలో కోల్పోయిన తన మద్దతును తిరిగి తీసుకురావడానికి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆయన తన నివాసంలో జేడీయూతో సంబంధం ఉన్న ముస్లిం నేతలతో సమావేశమయ్యారు.
ఆసియా క్రీడల్లో మెన్స్ టీమిండియా స్వర్ణం సాధించింది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ పూర్తి కాలేదు. దీంతో ఎక్కువ ర్యాంకింగ్ కారణంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు ఖాతాలో మరో స్వర్ణం చేరింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను షేర్ చేస్తూ బీజేపీ వివాదాస్పద క్యాప్షన్‌ను జోడించింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘాన్ కి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను 37.2 ఓవర్లలో 156 పరుగులకి బంగ్లాదేశ్ బౌలర్లు ఆలౌట్ చేశారు.
మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది.
ఆసియా క్రీడల్లో భారత్ ఎప్పటికప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది. ఆసియా క్రీడల్లో 14వ రోజు కూడా భారత్ పతకాల పరంపరను కొనసాగించింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది.
రేపు (ఆదివారం) చెన్నై వేదికగా వరల్డ్ కప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలోకి దిగుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలుపొంది.. శుభారంభాన్ని అందించాలని అనుకుంటుంది. ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుకు మంచి రికార్డులు ఉన్నప్పటికీ.. రేపటి మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.