World Cup: 2019-2003 వరల్డ్ కప్.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ వివరాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు (ఆదివారం) చెన్నై వేదికగా వరల్డ్ కప్లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలోకి దిగుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలుపొంది.. శుభారంభాన్ని అందించాలని అనుకుంటుంది. ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుకు మంచి రికార్డులు ఉన్నప్పటికీ.. రేపటి మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 2003-2019 వరకు వరల్డ్ కప్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Revanth Reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Also Read
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
2019 వరల్డ్ కప్
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2019 టోర్నీలో టీమిండియా జోరు వరుసగా రెండో మ్యాచ్ లోనూ కొనసాగించింది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ గా కింగ్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు వహించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 36 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేశాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 70 బంతుల్లో 57 పరుగులు, శిఖర్ ధావన్.. తొలి వికెట్‌కి 22.3 ఓవర్లలో 127 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. అనంతరం ఛేదనలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 84 బంతుల్లో 56 పరుగులు చేశాడు. స్టీవ్‌స్మిత్ 70 బంతుల్లో 69 పరుగులు బాదినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఆఖరికి 316 పరుగులకి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.
2015 వరల్డ్ కప్
న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2015 టోర్నీలో సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని సారథ్య బాధ్యతలు వహించారు. మొదట బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 116 బంతుల్లో 81 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 93 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు, మోహిత్ శర్మ 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ చేశారు. ఆ తర్వాత 329 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 233 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు 34, శిఖర్ ధావన్ 15, అజింక్య రహానే 44, కెప్టెన్ ధోని 65 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, జేమ్స్ ఫాల్కనర్ 3, జాన్సన్ 2, హేజిల్ ఉడ్ ఒక వికెట్ తీశారు. ఈ టోర్నీలో సెమీ ఫైనల్ వరకు వచ్చిన ఇండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. చివరకు ఆసీస్ జట్టు టోర్నీ గెలుచుకుంది.
2011 వరల్డ్ కప్
2011 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ రికీ పాంటింగ్ 104 పరుగులు చేశాడు. ఓపెనర్లు షేన్ వాట్సన్ 25, బ్రాడ్ హ్యాడిన్ 53, చివర్లో డేవిడ్ హస్సీ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ 4వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 15, సచిన్ టెండూల్కర్ 53, గౌతమ్ గంభీర్ 50, కోహ్లీ 24, యువరాజ్ సింగ్ 57, సురేశ్ రైనా 34 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ, టైట్, వాట్సన్, డేవిట్ హస్సీ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఫైనల్ లో శ్రీలంకపై ఇండియా భారత్ ఘన విజయం సాధించింది.
2007 వరల్డ్ కప్
2007 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో మధ్యలోనే ఇంటి బాట పట్టా్ల్సి వచ్చింది. వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఈ వరల్డ్ కప్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
2003 వరల్డ్ కప్
2003 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇండియాపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 10 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో ఆసీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి ఆస్ట్రేలియా గెలుపొందింది. కెప్టెన్ గా సౌరభ్ గంగూలీ కెప్టెన్ గా వ్యవహరించారు. భారత బ్యాటింగ్ లో సచిన్ టెండూల్కర్ 36, హర్భజన్ సింగ్ 28, అనిల్ కుంబ్లే 16, దినేష్ మోంగియా 13 పరుగులు చేశారు. ఇక ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ 3, జాసన్ గిలిప్స్ 3, బ్రాడ్ హాగ్, డారన్ లెహమన్, మెక్ గ్రాత్ తలో వికెట్ తీశారు. ఇక ఆసీస్ బ్యాటింగ్ లో గిల్ క్రిస్ట్ 48, హెడెన్ 45, రికీ పాంటింగ్ 24 పరుగులు చేశారు. మరోసారి ఫైనల్ వరకు వెళ్లిన ఇరు జట్లు.. చివరలో ఆస్ట్రేలియా జట్టు ఇండియాపై 125 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ రికీ పాంటింగ్ 140 పరుగులతో శతకం సాధించారు. ఓపెనర్ గిల్ క్రిస్ట్ 57, హెడెన్, 37, మార్టిన్ 88 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు తప్ప.. ఇంకెవరు వికెట్లు పడగొట్టలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 82 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ 47, యువరాజ్ సింగ్ 24, గంగూలీ 24 పరుగులు చేశారు. ఈ ఫైనల్ మ్యా్చ్ లో ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపొంది టోర్నీని సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
-
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
-
RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
-
Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!