బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని, న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలని ఆమె అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం.
జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని గోప్లపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రాల నర్సింహులు, మల్లెపోగు యాదయ్య, శివతో పాటు 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామ శివారులో దాదాపు 100 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిగడపకు చెందిన కొందరు గ్రామస్థులు శనివారం తమ పొలాల సమీపంలో కోతులు మృతి చెందడం చూసి స్థానిక అధికారులకు సమాచారం అందించారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్‌కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రముఖ నటుడు, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూకట్పల్లి నుంచి బరిలోకి దిగుతున్నట్లు.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) వేదికగా స్పందించారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని కాంగ్రెస్ ఖండించింది. పాలస్తీనా ప్రజల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో విశ్వసిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.