Monkeys: అనుమానాస్పద స్థితిలో 100కు పైగా కోతుల మృత్యువాత.. అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeys: సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామ శివారులో దాదాపు 100 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిగడపకు చెందిన కొందరు గ్రామస్థులు శనివారం తమ పొలాల సమీపంలో కోతులు మృతి చెందడం చూసి స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. కోతుల మృతికి గల కారణాలపై ఆ శాఖ అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే చనిపోయిన కోతుల నమూనాలను కూడా సేకరించారు. నమూనాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కారణాలను నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: Road Accident: ఒడిశాలో ట్రక్కును ఢీకొన్న బస్సు.. 21 మందికి గాయాలు
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
అయితే, ఇప్పటి వరకు కోతులను వేరే ప్రదేశంలో విషం పెట్టి చంపి, తమను తాము రక్షించుకోవడానికి, కోతుల మృతదేహాలను గ్రామ సమీపంలో విసిరివేసినట్లు అనుమానిస్తున్నారు. శాంపిల్‌ను పరిశీలించడంతో పాటు పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి దృశ్యం చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితి పరిశీలించారు. అలాగే.. స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!