భారత వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు (ఆదివారం) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. వారి గొప్ప సేవ, త్యాగం మన గగనతల భద్రతకు భరోసానిస్తుందని అన్నారు. భారత వైమానిక దళం యొక్క ధైర్యసాహసాలు, నిబద్ధత, అంకితభావానికి భారతదేశం గర్విస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతీకార చర్య కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత జానారెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 75 వేల కోట్ల అప్పు చేస్తే.. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ 5లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా.. దేశంలో తొమ్మిదేళ్లలో 112 లక్షల కోట్లు మోడీ ఖర్చు చేశాడని తెలిపారు. మోడీ, కేసీఆర్ లు చేసిన అవినీతిపై ఒకరిపై ఒకరు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేసినా స్వీకరించలేదని జానారెడ్డి…
బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలను పురంధేశ్వరి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు పురంధేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య.. ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు వెళ్లే తన విమానాలను రద్దు చేసింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి వెళ్లే ఎయిరిండియా విమానాలను అక్టోబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల, నవాబుపేటలో రూ. 21 కోట్ల 49 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సురంగాల్ లో శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణా పథకాలను దేశంలోని కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కాపీ కొడుతున్నారన్నారు. దేశం తెలంగాణా వైపు…
పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు ప్రమాదం తప్పింది. గోరంట్లలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేపై ఓ ఆగంతకుడు డిటోనేటర్ విసిరాడు. గోరంట్ల మండలం గడ్డం తండా వద్ద 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకరనారాయణ నిర్వహించారు.
హైదరాబాద్ అంబర్ పేటలో సేవ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఇప్పటికే డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, ఆర్ట్స్ కాలేజీ చరిత్ర తెలిసేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ పెట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ ను నిర్లక్ష్యం చేస్తుందని…
టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుమందు వరకు టీఎస్ ఆర్టీసీచైర్మన్గా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి కొనసాగారు. తాజాగా ఆయన స్థానంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. రెండు సంవత్సరాల పాటు ముత్తిరెడ్డి కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధ్యం అవుతుందా అని అనుకున్నాం... కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. దక్షత…