Bandla Ganesh: కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత బండ్ల గణేష్.. ఆయన రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandla Ganesh: ప్రముఖ నటుడు, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగుతున్నట్లు.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) వేదికగా స్పందించారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. తాను కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇస్తానని చెప్పారు కానీ, ఈసారి టికెట్ వద్దని బండ్ల గణేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యమని.. దానికోసం పనిచేస్తానని వెల్లడించారు. తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదన్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తన ధ్యేయమని.. తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామన్న బండ్ల అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Bhagavanth Kesari Trailer: బాలయ్య కోసం కదిలొస్తున్న మాస్ డైరెక్టర్స్…
Also Read
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
‘‘నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు.’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన గత ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో ఆ పార్టీ తరఫున మాట్లాడారు. ఈ క్రమంలోనే కొన్ని ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈసారి కూకట్‌పల్లి టికెట్ బండ్ల గణేష్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తోందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.
మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.
నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు.…
— BANDLA GANESH. (@ganeshbandla) October 8, 2023
తాజావార్తలు
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!