సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు.
అక్టోబర్ 7, 2023, ఉదయం సమయం. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించింది. సాధారణ రోజుల మాదిరిగానే ప్రజలు నిద్రలేచిన తర్వాత వారి రోజువారీ కార్యకలాపాల వైపు వెళ్లవలసి ఉండగా, వందలాది మంది ప్రజలు నిద్ర నుంచి మేల్కొనలేని విధంగా ఉదయం ప్రారంభమైంది.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది.
కర్నాటకలోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటనను ప్రభుత్వం దీనిని "తీవ్రమైన సంఘటన" అని పేర్కొంది. ఆదివారం ప్రమాద స్థలాన్ని డిప్యూటీ సీఎం డికె శివకుమార్ సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నారు
ఎవరైనా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే తాను మౌనంగా ఉండబోనని, కర్ణాటకలో గణపతి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నిస్తున్న వారిని కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. సనాతన ధర్మం తన నరనరాల్లో ప్రవహిస్తుందని అని అన్నారు. హవేరీ జిల్లాలోని బంకాపూర్‌లో శనివారం జరిగిన హిందూ జాగృతి సమ్మేళన్‌లో బొమ్మై ప్రసంగిస్తూ.. గణపతి పండుగను ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.