Warangal: జనగామలో బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వివరాలలోకి వెళ్తే.. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనకు హాజరు కానున్న ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు అనే ఉదేశంతో జనగామ ఆర్టీసీ డిపో నుండి అన్ని ఆర్టీసీ బస్సులని మంత్రి పర్యటనకు పంపించారు. దీనితో ఆర్టీసీ బస్సుల్లో పాఠశాలకు వెళ్లే మోడల్ స్కూల్ విద్యార్థులు ఎప్పటిలానే పాఠశాలకు వెళ్లేందుకు జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామం దగ్గర బస్టేషన్ కి వచ్చారు. కాగా అక్కడికి ఒక్క బస్సు కూడా రాకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read also:Fire Accident : టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి..
ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు జనగామ ఆర్టీసీ డిపోకు ఫోన్ చేసారు. ఒక్క బస్సు అయిన పంపాల్సిందిగా డిపో మేనేజర్ ని అభ్యర్ధించారు విద్యార్థుల తల్లిదండ్రులు. కాగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన జనగామ ఆర్టీసీ డిపో మెంజెర్ ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి అంటూ మేనేజర్ సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి నిరాశ చెందిన తల్లిదండ్రులు పిల్లలని తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడం ఇష్టం లేక కొందరు విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాల లోను, ఆటోల లోను ఎక్కించి పాఠశాలకు పంపారు. కాగా డబ్బులు లేని విద్యార్థులు చేసేదేమి లేక ఇంటికి తిరిగి వెళ్లి పోయారు. ఇలా విద్యార్థులని ఇబ్బంది పెట్టడం పైన విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.