మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రాగానే రూ. 750కి ఎల్పిజి సిలిండర్, నెలకు రూ. 2 వేలు పెన్షన్, రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తామని హమీలు ఇచ్చారు.
అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీలో ఏమైనా విభేదాలు, పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలని సూచించారు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.
H-1B visa: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు, ఉద్యగం చెయ్యాలి అనుకునే వాళ్లకు అమెరికా వివిధ రకాల వీసాలను అందిస్తుంది. వీటిలో హెచ్-1బీ వీసా ఒకటి. ఇది వలసేతర వీసా. అంటే ఇది US లోని కంపెనీలు వాళ్లకు ఆవరసమైన ఉద్యోగులను ఇతర దేశాల నుండి ఎపిక చేసుకోవడానికి ఈ వీసా వెసులుబాటు కలిపిస్తుంది. H-1B వీసా టైం పీరియడ్ 3 నుండి 6 సంవత్సరాలుగా ఉంటుంది. యజమానులు ఈ వీసా కింద విదేశీ…
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. వివస్త్రని చేసి గోళ్ళతో రక్కి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ వద్ద ఉన్న బంగారు నగలును అపహరించారు.
పండగపూట తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ వద్ద బస్సు, సుమో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును కారు ఢీకొట్టడంతో ఘటన చోటుచేసుకుంది.
చెన్నైలోని ఆవడి వద్ద లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం అన్ననూర్ వర్క్‌షాప్ నుండి ఆవడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 4 కోచ్‌లు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. మెరీనా బీచ్‌కు వెళ్లే ఈ రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారం (అక్టోబర్ 23) సాయంత్రంలోగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత ఈ తుఫానుకు 'హమున్' అని పేరు పెట్టనున్నారు.
ఈరోజు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్‌జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ ను పరిశీలించనున్నారు.
తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి. మంగళవారం ఉదయం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని జగ్గారెడ్డి అన్నారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు.