దేశ అంతరిక్ష యాత్రల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ ఆకాంక్షించారు. ఈ కోరిక ప్రధాని మోడీ సహా దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తోందని అన్నారు.
పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయకుండా ఆపాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ప్రపంచం యుద్ధం, శాంతిని ఎంచుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.
శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా.. ఇక నుంచి ఆ దేశానికి వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ద్వీప దేశం పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల మధ్.. భారతదేశం, ఇతర ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు జారీ చేసే విధానాన్ని శ్రీలంక మంత్రివర్గం ఆమోదించిందని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఈరోజు తెలిపారు.
31వ తేదీన కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ ఉంటుందన్నారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 31న సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని breaking news, latest news, telugu news, big news, mahesh kumar goud, rahul gandhi,
నిర్మాణ రంగంలో కొత్తదనం సృష్టించాలనే ఆశయంతో 2015 సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, 30 పైగా ప్రాజెక్టులతో, 8 వేల మందికి పైగా సొంతింటి కల నెరవేర్చి, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వేలాది కుటుంబాలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించి, స్థిరాస్తి రంగంలో తమదైన ముద్ర వేసుకుని 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుపెడుతోంది.
Viral news: ప్రస్తుత కాలంలో మద్యం ప్రియులు చాలామందే ఉన్నారు. ఆడా మగా అనే బేధం లేకుండా వీకెండ్ వస్తే చాలు చాలంది బీర్ బాటిల్ వెనక పరిగెడుతుంటారు. గ్లామర్ పెంచుకోవడానికి కొందరు.. ఫ్రేస్టేషన్ దించుకోవడానికి కొందరు. లవ్ ఫెయిల్యూర్ అని లైఫ్ ఫెయిల్యూర్ అని ఇలా ఏదో ఒక రీసన్ తో బార్ కెళ్ళి బీరు తాగుతారు. ఇంకొందరు ఇంటిని బార్ గా మార్చేస్తారు. అయితే బీర్ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగి చేసిన పని గురించి…
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలయంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపనకు ముందు, ట్రస్ట్ ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు చివరి తేదీ 31 అక్టోబర్ 2023.
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై అనేక పుకార్లు, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుండెపోటుతో పుతిన్ మంచంపై నుంచి పడిపోయినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి.