కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఈరోజు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్‌జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ ను పరిశీలించనున్నారు.
Earthquake: తైవాన్, నేపాల్‌లో భూకంపం
మరోవైపు 20 పిల్లర్ సింక్ కావడంతో గేట్ విరిగింది. లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత నీటి ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తి 45,260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 22,500 క్యూసెక్కులు.. కాగా.. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ లో 0.632 టీఎంసిలు నీటినిలువ ఉంచారు అధికారులు. బ్యారేజ్ వంతెన కుంగడంతో 20,21 పిల్లర్ వద్ద బాంబు పేలినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. భారీ శబ్ధంతో వంతెన కుంగడంతో సంఘవిద్రోహుల చర్యగా అనుమానం రావడంతో.. బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, డాగ్ స్కాడ్ రంగంలోకి దిగింది. బ్యారేజ్ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీ మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగుతున్నాయి. కాగా, ప్రాజెక్టు పిల్లర్లు కూలిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు తెలిపారు. ప్రస్తుతం 40 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తిరుపతిరావు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని 2016 మే 2వ తేదీ నిర్మాణం చేపట్టగా.. 2019 జూన్ 21న ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ బ్రిడ్జిని నిర్మించింది. వాస్తవానికి నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబరు పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పని పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.614 టీఎంసీల నీరు ఉంది. శనివారం సాయంత్రం నుంచి 8 గేట్ల ద్వారా 14,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే రాత్రివేళ మహారాష్ట్రకు వెళుతున్న వాహనదారులు వంతెన కుంగిపోయిన విషయాన్ని గుర్తించి బయటకు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.