H-1B visa: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు, ఉద్యగం చెయ్యాలి అనుకునే వాళ్లకు అమెరికా వివిధ రకాల వీసాలను అందిస్తుంది. వీటిలో హెచ్-1బీ వీసా ఒకటి. ఇది వలసేతర వీసా. అంటే ఇది US లోని కంపెనీలు వాళ్లకు ఆవరసమైన ఉద్యోగులను ఇతర దేశాల నుండి ఎపిక చేసుకోవడానికి ఈ వీసా వెసులుబాటు కలిపిస్తుంది. H-1B వీసా టైం పీరియడ్ 3 నుండి 6 సంవత్సరాలుగా ఉంటుంది. యజమానులు ఈ వీసా కింద విదేశీ పౌరులను ఉధ్యోగంలో నియమించుకుంటారు. US లో గ్రీన్ కార్డ్ ఉన్న వ్యక్తులు ఉద్యోగులకు H-1B వీసా వీసాను నిరవధికంగా పునరుద్ధరించవచ్చు. అయితే అర్హత అవసరాలను క్రమబద్ధీకరించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి..
Read also:Israel–Hamas war: యుఎస్ లక్ష్యాలపై ఇరాన్ దాడులను చురుకుగా ప్రోత్సహిస్తోందని వైట్ హౌస్ ఆరోపణ
యజమానులు అలానే కార్మికులకు మరిన్ని ప్రయోజనాలు అలానే సౌలభ్యాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశంగా H-1B వీసా ప్రక్రియలో మార్పులు చేశారు అని U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొన్నది. ఇందులో ముఖ్యంగా ఒక ఉద్యోగి ఇప్పుడు చేస్తున్నట్లుగా ఇకపై బహుళ దరఖాస్తులను సపర్పించలేరు. అలానే వ్యక్తులు డైరెక్ట్ గా కంపెనీ ద్వారా H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికా అధికారుల సైట్ సందర్శనల ప్రక్రియ ప్రతిపాదన కూడా చేశారు. దీని ద్వారా కంపెనీ గురించి తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉంది. దీని వల్ల మోసాలను అరికట్టవచ్చు అని బాలసుబ్రమణి పేర్కొన్నారు. బాలసుబ్రమణి మాస్టర్ డిగ్రీ చేసేందుకు us వెళ్లారు.