జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తన పేరును తొలగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్సింగ్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ఐపీఎల్ క్రికెటర్ ఇల్లు కూడా ఉండడం గమనార్హం.. వివరాల లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం దాదాపు 12 గంటల 30 నిమిషాల సమయంలో ముంబై లోని వెస్ట్ కాందివాలి లోని మహావీర్ నగర్ లోని పవన్ ధామ్ వీణా సంతూర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా ఈ ఘటనలో ఓ మహిళతో పాటుగా 8 సంవత్సరాల చిన్నారి మృతి చెందగా.. మరో 5 మందికి…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(77) కన్నుమూశారు. బిషన్ సింగ్ బేడీ టీమిండియాలో గొప్ప స్పిన్నర్. అతను 1946 25 సెప్టెంబర్ న పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. బిషన్ సింగ్ బేడీ 1966లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి 13 ఏళ్లపాటు టీమిండియా మ్యాచ్ ల్లో విన్నర్గా నిరూపించుకున్నాడు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు.
political news: కర్ణాటకలో విద్యుత్తు సంక్షోభం నెలకొంది. కర్ణాటక ప్రజలు కరంట్ కోతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన కుమారస్వామి ఆ రాష్ట్ర మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో కృత్రిమ విద్యుత్తు కొరతని సృష్టిస్తున్నదని ఆరోపించారు. రానున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమ అధిష్ఠానానికి కావాల్సిన ఫండ్స్ కోసమే సిద్ధరామయ్య సర్కారు ప్రైవేట్ విద్యుత్తు…
తాను పోటీ పై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానన్నారు. కేసీఆర్ రా.. కామారెడ్డికి ఇద్దరం తల పడదామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం తాను ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరని తెలిపారు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు.
నేటి సాయంత్రం తీవ్ర వాయుగుండం"హమున్" తుఫాన్ గా మారనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 13కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయుగుండం బలపడుతుంది. ఈ వాయుగుండం పారాదీప్ కు దక్షిణంగా 360 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తుఫాన్ గా మారిన తరువాత "హమున్" దిశ మార్చుకోనుంది.
Hyderabad: బ్రతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు తిన్నాయని.. భర్తతో గొడవపడి బయటకి వస్తే మహిళని మాటల్లో పెట్టి బంగారం మాయం చేశారు మరో ఇద్దరు మహిళలు.. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మధురానగర్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఈ నెల 13వ తేదీన తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. కాగా ఆ మహిళను గమనించిన మరో ఇద్దరు మహిళలు…
పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో సామాజిక సాధికార యాత్ర సన్నాహా సమీక్ష సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదని విమర్శించారు.