2023 ప్రపంచకప్‌లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆసీస్ విధ్వంసం సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పార్టీ మార్పుపై స్పందించారు. ఇప్పటికే లేఖ విడుదల చేశానన్న రాజగోపాల్ రెడ్డి.. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పని చేశానన్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ ఎంపికలో జరిగిన తప్పుడు నిర్ణయాల వల్లా కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందన్నారు.
బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో కాంగ్రెస్ పేర్కొంది. కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రిక విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రతీ ఏడాది దసరా మహోత్సవం అనంతరం బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఘనంగా నిర్వహించారు.
E Shinde Dussehra Rally: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దసరా ర్యాలీ నిరవహించారు. ఈ నేపథ్యంలో ఆయన ర్యాలీకి హాజరు అయిన ప్రజలు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైయ్యారు.. వివరాలలోకి వెళ్తే.. ఏక్నాథ్ షిండే దసరా ర్యాలీ కి వెళ్లి ప్రజలతో తిరిగి వస్తున్న ప్రైవేట్ బస్సు థానే జిల్లాలో ప్రమాదానికి గురైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ముంబై-నాసిక్ హైవేపై కొలంబే వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది.…
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
Sushil Kumar Shinde: సుశీల్ కుమార్ శంభాజీ షిండే గురించి పరిచయం అవసరం లేదు. 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షోలాపూర్ సెషన్స్ కోర్టులో బెయిలిఫ్గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత మహారాష్ట్ర పోలీస్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. అనంతరం అతను ఆరు సంవత్సరాలు మహారాష్ట్ర CID లో పనిచేశాడు. కాగా 1971లో షిండే కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా చేరిన ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. తొలిసారిగా 2003లో…
Amazon River: ప్రకృతి లో సంభవించిన మార్పులు కాలగమనంలో కలిసిపోయిన చరిత్రను వెలికితీసాయి. అందుకేనేమో ఏది జరిగిన మన మంచికే అంటారు పెద్దలు. నీటి కరువు భూస్థాపితం చేయబడిన నిగూడ చరిత్రను ప్రపంచానికి తెలిసేలా చేసింది. వివరాలలోకి వెళ్తే.. బెలీజియంలో తీవ్ర స్థాయి నీటి కరువు సంభవించింది. గతంలో కనీ విని ఎరుగని కరువు ప్రస్తుతం బెల్జియం ను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ నదిలో నీరు చాలా వరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో అమెజాన్ నది…