Hyderabad: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చంపా పేట లోని రాజీ రెడ్డి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతీ హత్య మిస్టరీగా మారింది. వివరాలలోకి వెళ్తే.. చంపా పేట రాజిరెడ్డి నగర్ లోని ఓ ఇంట్లో స్వప్న(24) ప్రేమ్(25) అనే దంపతులు ఉంటున్నారు. కాగా వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి రోజు గుర్తు తెలియని వ్యక్తులు వస్తూపోతూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని కూడా యువతి యువకుడిని పలు మార్లు హెచ్చరించాడు. అయిన గుర్తు తెలియని వ్యక్తులు వస్తూ పోతూనే ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం రావడంతో ఇంటి యజమాని బయటకు వచ్చి చూసాడు. ప్రేమ్ రెండొవ అంతస్తు నుండి కింద పడి ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్వప్న, ప్రేమ్ నివసిస్తున్న ఇంటి నుండి కంగారుగా బయటకు వచ్చి వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.
Read also:Asaduddin Owaisi: ‘‘మీకు అంత సానుభూతి ఉంటే’’.. అమిత్‌షాపై ఓవైసీ ఫైర్
దీనితో భయాందోళనకు గురైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకి సమాచారం అందించాడు. అనంతరం స్వప్న నివాసం ఉంటున్న ఇంటి లోనికి వెళ్లి చూడగా యువతి రక్తం మడుగులో మృతి చెంది ఉంది. కాగా పైన నుండి పడిన ప్రేమ్ కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ క్రమంలో చికిత్స కోసం ప్రేమ్ ని ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజ్ ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. యువతి హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలానే ప్రేమ్ బిల్డింగ్ నుంచి ఆత్మహత్యకు యత్నించడా.. లేక గుర్తు తెలియని వ్యక్తులు నెట్టి వేశారా అనే అనుమానాలు కలుగుతుండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు.