ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంట వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి breaking news, latest news, telugu news, cm jagan, latest news, telugu news,
సీఎం కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆసరా పెన్షన్ ఐదు వేలకు పెంచుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలోని నాల్సబ్ గడ్డలో బీఆర్ఎస్లో చేరికల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్థాయి కేటీఆర్, హరీష్, కవితలకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా జానారెడ్డి హాజరయ్యారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చే హామీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన లైవ్ డిబేట్లో మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారి తీసింది.
మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. డిజైన్ లోపం ఉంటే మూడు సీజన్లు ఎలా తట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని అన్నారు. కానీ ఫౌండేషన్ కింద ఇసుక కదలిక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని గ్రామాల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగి పోవడం తీవ్రమయిన అంశమని ఆయన అన్నారు. క్వాలిటీ విషయంలో అనుమానాలు మొదలయ్యాయని ఆయన వెల్లడించారు.