ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇబ్రహీం జద్రాన్ 131 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. ఈ ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. 143 బంతుల్లో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించలేదు.
ఉప్పు ప్రకృతిలో అత్యద్భుతమైన సృష్టి అంటే అది అతిశయోక్తి కానేరదు. ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఉప్పు లేకుండా ఆహారం తినాలంటే చాలా కష్టం. అలాగని గుప్పిళ్లతో బుక్కెయ్యక్కర లేదు. రోజుకి 200 మిల్లీగ్రాములు తింటే చాలు. అయితే చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గద్వాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ ప్రాంతాన్ని కేసీఆర్ సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్ 13వ వార్డు, 22వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే తమకు తాగునీటి కష్టాలు తీరాయని ఈ సందర్భంగా వార్డులో మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) రెండవ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 9 వరకు ఎల్ఎల్సీ టోర్నీ జరుగనుంది. డెహ్రాడూన్, రాంచీ, జమ్ము, విశాఖపట్నం, సూరత్ నగరాల్లో లెజెండ్స్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీలో అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయిం ట్స్, సదరన్ సూపర్ స్టార్స్, బిల్వారా కింగ్స్ పోటీపడుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంథనిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో రాజకీయ పరిణతి పెరగాలి.. ప్రజస్వామ్య పరిణతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఒక బార్బర్ వెరైటీగా హెయిర్మసాజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా మనం బార్బర్ షాపుకు వెళ్తే బార్బర్ ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే తమ గిరాకీ దెబ్బతినకుండా ఉండటానికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తాడు. కానీ ఈ బార్బర్ షాపులో హెయిర్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చిన కస్టమర్లపై బార్బర్ ప్రవర్తించే తీరు చేస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఆ బార్బర్ చేయడమే అలా చేస్తాడా.. లేదంటే సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం చేస్తున్నాడా అనేది తెలియదు.
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన అన్నారు. కానీ నాకు సీఎం కావాలని లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, బీఆర్ఎస్ను బొంద పెట్టాలనే కసి ఇక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్‌లో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు.