లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) రెండవ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 9 వరకు ఎల్‌ఎల్‌సీ టోర్నీ జరుగనుంది. డెహ్రాడూన్, రాంచీ, జమ్ము, విశాఖపట్నం, సూరత్ నగరాల్లో లెజెండ్స్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీలో అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయిం ట్స్, సదరన్ సూపర్ స్టార్స్, బిల్వారా కింగ్స్ పోటీపడుతున్నాయి. అయితే రెండో సీజన్‌కు ప్రచారం కల్పించడంలో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్‌ఎల్‌సీ ట్రోఫీ టూర్ నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. రేపటి నుంచి ఢిల్లీలో ప్రచారం ప్రారంభం అవుతుంది. 15 రోజుల పాటు.. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రచారం జరుగనుంది.
Read Also: Viral Video: ఈ వీడియో చూస్తే బార్బర్ షాపుకు వెళ్లడానికే భయపడుతారు.. బూట్లు, చెప్పులతో కొట్టుకుంటూ..!
ఈ ప్రచారంలో పలువురు కేంద్ర మంత్రులు, భారతీయ రైల్వే బృందం భాగం కానున్నారు. దేశంలోని ప్రముఖ క్రీడా ప్రముఖులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొంటారు. గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్, ఎస్ శ్రీశాంత్, పార్థివ్ పటేల్, షేన్ వాట్సన్, ప్రవీణ్ కుమార్, ఝులన్ గోస్వామి వంటి వెటరన్‌లు ఈ ప్రత్యేక ప్రచారంలో చేరనున్నారు.
Read Also: Somireddy Chandramohan Reddy: రైతుల ఆత్మహత్యల్లో.. అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానం
ఎల్‌ఎల్‌సీ ట్రోఫీని వందేభారత్ రైళ్లలో ఊరేగింపడంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. లెజెండ్స్ లీగ్ క్రికెట్, లెజెండరీ ఆటగాళ్లను వందే భారత్‌కు స్వాగతిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించే ఈ అద్భుతమైన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. మరోవైపు లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. భారతీయ రైల్వేతో భాగస్వామ్యం, క్రీడల ప్రోత్సాహానికి దోహదపడటం తమకు గర్వకారణమన్నారు. లెజెండ్స్ లీగ్ కు ఆదరణ పెరుగుతుందని.. ఈ సీజన్‌లో లెజెండ్స్ రాక్ అవుతుందని అన్నారు.