పొడుగు ఉన్న వారి కంటే.. పొట్టిగా ఉన్న వారిని కొంచెం హేళనగా చూస్తారు. పొట్టిగా ఉన్న వారు కూడా పొడుగు ఉన్నవారిని చూసి బాధపడుతుంటారు. తాము కూడా ఎత్తు ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఎత్తు పెరగాలని కలలు కంటుంటారు. అయితే.. ఒక దశ రాగానే పెరగడం అనేది ఆగిపోతుంది. అంతేకాకుండా.. వారి తల్లిదండ్రులు ఎంత హైట్ ఉంటే పిల్లలు కూడా అంతే ఎత్తు పెరుగుతారు. ప్రస్తుత కాలంలో పొట్టిగా ఉండటం, ఎత్తు పెరగకపోవడం సమస్య ప్రజలలో ఎక్కువగా ఉంది. కొంతమంది చాలా త్వరగా ఎత్తు పెరుగుతుంటే.. మరికొందరు ఎత్తు పెరగడం లేదు. అయితే.. ఎత్తు పెరగడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటిస్తే ఎత్తు పెరుగుతారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Read Also: Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని.. ఎందుకు తగ్గినట్టు?
సరైన ఆహారపు అలవాట్లు:
ఆరోగ్యకరమైన ఆహారం మన ఆరోగ్యంతో పాటు ఎత్తుపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి.. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, జింక్, ఐరన్ వంటి పోషకాలు అవసరం. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీనితో పాటు.. ఎత్తును పెంచడానికి సహాయపడుతుంది. అందుకోసం.. యుక్త వయస్సు వరకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే మీ గ్రోత్ ప్లేట్లు (ఎముకలు పెరుగుతున్న భాగాలు) చురుకుగా ఉన్నంత వరకు మాత్రమే ఇది ప్రభావవంతంగా ఉంటుంది. యుక్తవయస్సు తర్వాత పెరుగుదల ఉండదు.
మంచి నిద్ర:
శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. నిద్ర శరీరంలో గ్రోత్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎముకలు, కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. నిద్ర లేకపోవడం వల్ల శారీరక అభివృద్ధి ఆగిపోతుంది. అందుకోసం తగినంత నిద్ర పోతే ఎత్తు ఖచ్చితంగా పెరుగుతారు. 8 గంటల నిద్ర అవసరం.
వ్యాయామం:
స్విమ్మింగ్, యోగా, బాస్కెట్‌బాల్, పుష్ అప్స్ వంటి వ్యాయామాలు మీ ఎత్తును పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొన్ని రకాల ఆసనాలు కూడా ఎత్తును పెంచడంలో సహాయపడుతాయి. దీంతో.. కండరాలను బలంగా, ఫ్లెక్సిబుల్‌గా చేస్తాయి. వ్యాయామం, ఆసనాలు మీ శరీర ఆకృతిని మారుస్తాయి.
ధూమపానం, మద్యం మానుకోండి:
18-20 నుంచి వయస్సు వాళ్లలో ఎత్తు తక్కువగా ఉన్న వారు.. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఎత్తు పెరుగుదలను ఆపుతాయి.