ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ఈరోజు (శుక్రవారం) నంద్యాలలో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:25కు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో మంత్రి నాస్యం మహమ్మద్ ఫరూఖ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నంద్యాలలో సి.ఎం.ఆర్. లాంటి పెద్ద మాల్స్ రావటం వలన నగరం మరింత అభివృద్ధి చెంది ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా సి.ఎం.ఆర్. చైర్మన్ వెంకటరమణకు శుభాకాంక్షలు తెలిపారు.
IND vs AUS: మ్యాచ్ మధ్యలో పవర్ కట్.. ట్రోల్స్‌తో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు
సి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. తమ సంస్థను గత 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ.. తమ యొక్క 39వ షోరూమును నంద్యాలలో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సి.ఎం.ఆర్.లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందని తెలిపారు. ప్రజలు తమకు కావాల్సిన అన్ని రకాల వేడుకలకు సి.ఎం.ఆర్. తగు విధంగా అన్ని మోడల్స్‌లో కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం సి.ఎం.ఆర్. ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం.ఆర్. అందిస్తుందని తెలిపారు.
Jairam Ramesh: పార్లమెంట్‌కి రూ.50,000 తీసుకెళ్లడం అసాధారణం కాదు..
సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. సి.ఎం.ఆర్. అంటే వన్ స్టాప్ షాప్ అన్నారు. ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయని పేర్కొన్నారు. తమ 39వ షోరూమును సంద్యాలలో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో లక్షలలో డిజైన్లు వేలల్లో వెరైటీలు లభిస్తాయని తెలిపారు. ప్రస్తుత యువతరానికి నచ్చేవిధంగా అన్నిరకాల వెరైటీలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీతార కృతిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం అన్ని సెక్షన్లు తిరిగి అన్ని రకాల వస్త్రాలను పరిశీలించి ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు క్వాలిటీ చాలా బాగుందని.. రీజనబుల్ ప్రైస్‌లో లభిస్తున్నాయన్నారు. అభిమానులతో సెలీలు దిగి తమ డ్యాస్సుతో ఫ్యాన్సును ఉర్రూతలూగించారు.