Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి.. చున్నీ లాగేసిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటిగా ఒకప్పుడు పలు సినిమాల్లో నటించిన కరాటే కళ్యాణి, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక అంశాల మీద స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హిందుత్వవాదిగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ, హిందూ సంఘాల మీద లేదా హిందూ దేవీదేవతల మీద ఎవరు కామెంట్ చేసినా ఆమె సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడడమే కాదు, పోలీస్ కేసుల వరకు వెళ్తున్నారు. తాజాగా ఆమె మీద దాడికి యత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆదిభట్ల వండర్లా దగ్గర ఇద్దరు నిందితులు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తూ ఉండగా, పంజాగుట్ట పోలీసుల సహాయంతో ఆ ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరిద్దరూ లక్కీ డ్రా పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ముందు వీడియో చేసి పోస్ట్ చేశారు. ఒక ఫార్చ్యూనర్ కారు లక్కీ డ్రా తీస్తున్నామని, గెలిచిన వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కూడా చేయిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు.
Also Read: Vk Naresh: వరుస సినిమాలు.. నరేష్ క్రేజ్ మాములుగా లేదుగా!
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
ఈ విషయం మీద ఇప్పటికే హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే వీరిపై కరాటే కళ్యాణి కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వారు ఆదిభట్ల వద్ద ప్రచారం చేస్తున్న సంగతి తెలుసుకొని వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, కరాటే కళ్యాణి మీదకు దూసుకువచ్చిన నిందితులు ఆమె చున్నీ కూడా లాగినట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లక్కీ డ్రా పేరుతో అనేకమంది కార్లు, హౌసింగ్ ప్లాట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయం మీద ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా స్పందించారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?