Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వావి వరసలు లేని రాజకీయాలు చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. పవన్‌కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి బాధితులకు ఇచ్చిన డబ్బుల కన్నా ఆయన వచ్చి వెళ్లిన చార్టెడ్ ఫ్లైట్ ఛార్జీలు అధిక రేటు అయ్యిందన్నారు. వచ్చి బాధితులకు సహాయం అందించి వెళ్ళక ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే అలవాటు అయిన కార్యక్రమం చేపట్టాడని మండిపడ్డారు.
Also Read: GVL Narasimha Rao: దమ్ముంటే రేవంత్ బీసీ సీఎం ప్రకటన చేయాలి..
విశాఖ హార్బర్‌కు 16 వేల కోట్లు వస్తున్నాయి ఏమీ మత్యకారుల కోసం ఉపయోగించట్లేదు అంటూ విషం చిమ్ముతున్నాడని ఫైర్ అయ్యారు. ఇంకా 4నెలలు ఆగితే నాది, చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది అంటాడు… 2014లో మీ ఇద్దరి ప్రభుత్వం ఉంది.. మరి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో టీడీపీకి ఓటు వేసి గెలిపించండి.. ప్రశ్నించడానికి నేను ఉన్నానని చెప్పాడు.. మరి ఏనాడైనా ప్రశ్నించాడా అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క ఫిషింగ్ హార్బర్ అయినా కట్టారా.. 960 కిలోమీటర్లు వున్న తీర ప్రాంతంలో ఒక్క హార్బర్ అయినా కట్టారా.. మరి ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. కనీసం ఒక్క జెట్టి అయినా కట్టారా కనీసం అనుమతులు అయినా ఇచ్చారా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కుప్పిగంతులు, వేషాలు చూసి ఊసరవెల్లి కూడా కంగారు పడిపోతుందన్నారు. అసలు మీరు అధికారంలో వున్నప్పుడు ఏ ఒక్క పని అయినా చేశారా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Also Read: Yogi Adityanath: అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలి.. వేములవాడ ప్రజలకు పిలుపు
విశాఖపట్నం బోటు ప్రమాదాల పై 50 వేల రూపాయలు ఇచ్చి నేను ఇస్తే అయినా ప్రభుత్వం బాధితులకు సహాయం చేస్తుంది అనడం నీ రాజకీయ అజ్ఞానానికు నిదర్శనమన్నారు. ఇలాంటి పచ్చి దగాకోరు ఎవరైనా వున్నారా అంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. నువ్వు ఆర్చి తీర్చి నిద్రలేచి వచ్చేసరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితులకు పాక్షికంగా బోటు దెబ్బతిన్న అందరికీ 100 శాతం సహాయాన్ని అందించారన్నారు. 7.11 లక్షల రూపాయలను బాధితులకు ప్రమాదం జరిగిన తరువాత రోజే అందించారని పేర్ని నాని స్పష్టం చేశారు.