Puvvada Ajaykumar: ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమిని మూట గట్టుకున్నారు. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నామన్నారు. తనపై గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
Read Also: Telangana Election Results: అగ్ర నేతల ఓటమి.. బీజేపీ గెలిచిన అభ్యర్థులు వీరే!
ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజమన్న ఆయన.. దాన్ని స్పోర్టివ్‌గా తీసుకుని ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న దరిమిలా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నానమని పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తన విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పటి వరకు పని చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులకు, కార్యకర్తలకు, మీడియా, అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.