తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో TSRTC యొక్క పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో నివాసం ఉంటున్న అన్ని వయసుల బాలికలు మరియు మహిళలు, లింగమార్పిడి వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. 9వ తేదీ(శనివారం) మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.…
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రైతులకు అండగా నిలుస్తామని ధైర్యాన్ని ఇస్తున్నారు. బాపట్ల జిల్లా పాత నందాయపాలెంలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రైతులను చూస్తుంటే బాధేస్తుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. వచ్చిన ఫిర్యాదులు వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. ప్రజా దర్బార్ కి రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాక ప్రజాభవన్ లో మంత్రి సీతక్క వినతి పత్రాలు స్వీకరించారు.
ఢిల్లీలో రాజ్యసభ బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లో ఫలితాలను నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ప్రభావం ఇంకో రాష్ట్రంపై పెద్దగా ఉండదని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. తెలంగాణలో కనీసం 14 లోక్ సభ స్థానాల్లో గెలిచేలా బీజేపీ…
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఫెడ్లర్లను అరెస్టు చేశారు. ఒడిస్సా నుండి హర్యానాకు గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. గంజాయి రవాణాకు ట్రాన్స్పోర్ట్ ఆటలో సీక్రెట్ పార్టీషన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. ఒడిస్సా నుండి హైదరాబాద్ మీదుగా హర్యానాకు తీసుకెళ్తున్న ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి వద్ద వాహనం తనిఖీల్లో కోటి ఇరువై ఎనిమిది లక్షల విలువైన 510 కిలోల గంజాయిని…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నకిలీ, డబుల్ ఎంట్రీ ఓట్ల వ్యవహారం రాజకీయ రచ్చ రాజేస్తోంది. ఓట్లకు సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. కొంతకాలం నుంచి ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 2గంటల సమయంలో బాత్రూంలో కాలుజారి పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్వీట్ చేశారు. "తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గాయపడటం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని…