Hanumakonda: గతకొంత కాలంగా దేశంలో పలు కారణాలతో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఈ ప్రమాదాల వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుంది. చాల వరకు అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ కారణంగానే సంభవిస్తున్నాయి. తెలంగాణ లోనూ తరుచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లి ఘటన మరిచి పోక ముందే మరో అగ్ని ప్రమాద ఘటన వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కేంద్రం లోని మిషన్ హాస్పిటల్ స్వల్ప అగ్నిప్రమాదం వెలుగు చూసింది. ఒక్కసారిగా హాస్పిటల్ లోని స్టోర్ రూమ్ మంటలు చెలరేగాయి.
Read also:CM Jagan: నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.. ప్రతి ఇంటికి రూ. 2,500 ఇస్తాం..
ఈ నేపధ్యంలో భయాందోళనకు గురైన ఆసుపత్రి సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపులోకి తెచ్చిచ్చారు ఫైర్ సిబ్బంది. ఈ నేపథ్యంలో అధికారులు మాట్లాడుతూ.. మిషన్ హాస్పిటల్ లోని స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించగా హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చామని పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఘటన స్థలంలో రోగులు ఎవరు లేరని వెల్లడించారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు ఘటన స్థలంలో రోగులు ఎవరు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఘటన స్థలంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.