మిజోరం రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా జెడ్పీఎం పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా ఇవాళ ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు ఆయనతో రాజ్ భవన్ లో సీఎంగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన పార్టీ నేతల్లో కొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి జొరాంథంగా కూడా వెళ్లారు. ఎంఎన్‌ఎఫ్ శాసనసభా పక్ష నేత లాల్‌చందమా రాల్టేతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మరో మాజీ సీఎం లాల్ థన్హావ్లా కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జెడ్పీఎం పార్టీ నాయకుడిగా లాల్‌దుహోమాను, ఉపాధ్యక్షుడిగా కె.సప్దంగను పార్టీ నేతలు మంగళవారం ఎన్నుకున్నారు.
Read Also: Bhopal: కారు కొనే స్థోమతలేక బావమరిది బైక్ తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
ఇక, 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన జెడ్పీఎం పార్టీ 2018 ఎన్నికలలో 8 స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఆ సంఖ్యను 27కు పెంచుకుని మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిజోరంలో ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు కావాలి.. 2018 ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న మిజో నేషనల్ ఫ్రంట్ ఈసారి కేవలం 10 సీట్లలో విజయం సాధించింది. తద్వారా అధికార ఎంఎన్‌ఎఫ్ ఐదేళ్ల పాలనకు ముగిసింది.
Read Also: Fire Accident: హనుమకొండ లో అగ్నిప్రమాదం.. మిషన్ హాస్పిటల్ లో చెలరేగిన మంటలు..
అయితే, 8.57 లక్షల మంది ఓటర్లున్న మిజోరం రాష్ట్రంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. ఇందులో ఓటు హక్కును 80 శాతం మంది వినియోగించుకున్నారు. 18 మంది మహిళలతో పాటు మొత్తం 174 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. జెడ్‌పీఎం, ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 23 స్థానాల్లో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టింది. అయితే, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది. కానీ, ఒక్కసీటు కూడా గెలవలేదు.. కాగా, మిజోరంలో ఈసారి రికార్డు స్థాయిలో 77 శాతం పోలింగ్ పోల్ అయింది.