Group-1 Notification Released in Andhrapradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కారు మరో శుభవార్త చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీలో 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. డిప్యూటీ కలెక్టర్ 9, డీఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
Read Also: Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఐదు రోజులే పని..?
ఇప్పటికే పలు రకాల పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్నారు.. అందులో కొన్ని భర్తీ కాగా.. మరికొన్ని ఫలితాల వరకు వచ్చాయి.. ఇదిలా ఉండగా.. గురువారంగ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రూప్ -2 తాజా నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566లు భర్తీ చేయనున్నారు.. ఇక, గ్రూప్ -2 పరీక్షలకు 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనుంది ఏపీపీఎస్సీ.. ఈ పరీక్షల కోసం 2023 డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నారు.