Tiger Dead: పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో పెద్దపులి మృతి చెందినట్లు తెలుస్తోంది. మాచర్ల సమీపంలోనీ లోయపల్లి అటవీ ప్రాంతం వద్ద జంతువు కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కుందేళ్ల కోసం వేసిన కరెంటు తీగలు తగిలి అడవి జంతువు చనిపోయిందని నిర్ధారించారు. కుందేళ్ల వేటగాళ్లు చని పోయిన అడవి జంతువును తీసుకువెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో, పళ్లు, గోర్లు పీకి తగలబెట్టారని సమాచారం.
Read Also: Kakani Govardhan Reddy: సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుంది..
ఘటన సమాచారం అందుకుని అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు ప్రాంతం అటవీ ప్రాంతం నుంచి జంతువు కళేబరాన్ని హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు తరలించారు. పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపిన తర్వాత మృతదేహం పెద్దపులిదా లేక చిరుత పులిదా అన్నది తేలాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారి వివరాలు తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.