Kia Syros EV: కియా సిరోస్ నుంచి ఎలక్ట్రిక్ వెర్షన్.. గొప్ప ఫీచర్లతో 2026లో లాంచ్..!
- ఇటీవలే ఇండియాకు కియా సిరోస్ (Kia Syros EV)
- పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లాంచ్
- ఈ కారులో చాలా గొప్ప ఫీచర్లు
- ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ లో తర్వలో లాంచ్
- 2026 నాటికి ఇండియాలో ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే కియా సిరోస్ (Kia Syros EV) ఇండియాకు వచ్చేసింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఇందులో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ కియా సిరోస్ ఈవీ కూడా తర్వలో లాంచ్ కానుంది. 2026 నాటికి ఇండియాలో ప్రారంభించనున్నారు. కియా సిరోస్ ఈవీ వస్తే అందులో ఎలాంటి మార్పులు చూడవచ్చో తెలుసుకుందాం….
Read Also: Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..
Also Read
- Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
- 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
- Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
డిజైన్
కియా సిరోస్ ఈవీ డిజైన్.. ఐసీఈ (ICE) వేరియంట్‌కు దగ్గరగా ఉంటుంది. ఇది K1 ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండవచ్చు. అయితే కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు వలె మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎల్ఈడీ లైట్ల విషయానికొస్తే.. 3-పాడ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, L-ఆకారపు ఎల్ఈడీ టైల్లైట్లు, ఎల్ఈడీ DRLలు వంటి డిజైన్ ఎలిమెంట్లను ఇందులో చూడవచ్చు. అలాగే.. ఈ కారుకు ముందు, వెనుక బంపర్లను మరింత ఏరోడైనమిక్‌గా.. ఎలక్ట్రిక్ కారు అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయవచ్చు. ఇంటీరియర్ విషయానికొస్తే.. ఈ కారు క్యాబిన్ డిజైన్ ఒకే విధంగా ఉంచవచ్చు. లోపల విభిన్నమైన అప్హోల్స్టరీ, రంగులను చూడవచ్చు. దీంతో ఈ కారు మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
ఫీచర్లు
సిరోస్ ఈవీ ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు.. ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ డిస్ప్లే కోసం, డ్యాష్‌బోర్డ్‌కు హైటెక్ రూపాన్ని ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ క్లైమేట్ కంట్రోల్.. రెండు జోన్ల కోసం క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్‌ల కోసం 5 అంగుళాల స్క్రీన్‌ని చూడవచ్చు. పవర్-అడ్జస్టబుల్ సీట్లు.. డ్రైవర్ సీటు 4-వే పవర్ సర్దుబాటుతో కలిగి ఉంటుంది. లగ్జరీ చేర్పుల విషయానికొస్తే.. 64 రంగు ఆంబీఎంట్ లైటింగ్.. ముందు, వెనుక సీట్ల కోసం వెంటిలేషన్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండవచ్చు.
సెక్యూరిటీ ఫీచర్లు
కియా కంపెనీ తమ కార్లలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.. ఈ క్రమంలో సిరోస్ ఈవీలో అధునాతన భద్రతా లక్షణాలను చూడవచ్చు. ఈ కారులో ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉండనున్నాయో తెలుసుకుందాం. ప్రయాణీకులందరి భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) రేంజ్, బ్యాటరీ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. కియా సిరోస్ ఈవీ ఎప్పుడు లాంచ్ అవతుంతో తెలియనప్పటికీ.. ఈ కారు 400 కిలోమీటర్ల పరిధిని అందించగలదని ఊహిచవచ్చు.
తాజావార్తలు
-
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
-
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
ట్రెండింగ్
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!