క్రిస్మస్ సందర్భంగా తన అధికారిక నివాసాన్ని పాఠశాల విద్యార్థినులు సందర్శించారు. ఈ సందర్భంగా.. వారి ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లలు థంబ్స్-అప్ ఇవ్వడంతో తన కార్యాలయం అంతిమ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టు అనిపిస్తోందని ప్రధాని అన్నారు.
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా-టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేసి టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 245 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. కేఎల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతున్న సందర్భంలో.. దేశప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి కూటమి’ అహంకారాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి, సరైన బుద్ధి చెప్పాలి అని ఆయన అన్నారు. సనాతన ధర్మానికి, హిందుత్వం, హిందీ మాట్లాడే ప్రజలకు కాంగ్రెస్ నేతృత్వంలోని పనికిరాని కూటమి రోజురోజుకూ ప్రమాదంగా మారుతోందనే విషయాన్ని దేశప్రజలు గమనించాలన్నారు. అంతేకాకుండా..’మొదట్నుంచీ అవకాశం…
Fair Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలోని కట్టెల గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములో ఎగిసి పడుతున్న మంటలకు స్థానికులు బయటకు పరుగులు పెట్టారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు డీప్‌ఫేక్‌ల సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఉన్న ఐటీ నిబంధనలను అనుసరించాలని ఆదేశిస్తూ ఒక అడ్వయిజరీ జారీ చేసింది.
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో 'పేలుడు' సంభవించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం కాన్సులేట్ భవనం సమీపంలో పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది.
అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.
అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా కు సంబంధించి తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రి రూరల్ పెద్దపొలమడ క్రీడాప్రాంగణంలో "ఆడుదాం ఆంధ్ర" క్రీడా పోటీలను ప్రారంభించిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు.