Cab Driver Stabbed: ఓవర్‌టేక్ చేయడానికి దారి ఇవ్వలేదని.. క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cab Driver Stabbed: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓవర్‌టేక్ చేసేందుకు బైక్‌కు దారివ్వలేదన్న కోపంతో క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడ్డారు. అనంతరం ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ కేసుకు సంబంధించి మైనర్‌ను పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
Read Also: Vijay: షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
సంగం విహార్‌కు చెందిన మనోజ్ కుమార్ గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం అతను మాల్వియా నగర్ నుంచి ఐదుగురు ఉద్యోగులను తీసుకొని మరొక ఉద్యోగిని పికప్ చేసుకోవడానికి మెహ్రౌలీకి వెళ్తుండగా, అతని క్యాబ్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. రాత్రి 8.40 గంటల ప్రాంతంలో ముగ్గురు నిందితులు బైక్‌పై వచ్చి దారి ఇవ్వాలని మనోజ్‌ను కోరగా, స్థలం లేకపోవడంతో కుదరలేదు. దీంతో వారి మధ్య గొడవ జరిగి వారిలో ఒకరు కత్తితో మనోజ్ ఛాతిపై పొడిచాడు.
Read Also: Akhu Chingangbam Kidnap: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్ కిడ్నాప్
అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో స్థానికులు మనోజ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల్లో ఒకరైన మైనర్‌ని గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?