నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పలు ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. 31, డిసెంబర్ 2023 నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 1. కొన్ని రోడ్డు మార్గాలను మూసివేత: • నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం…
డిసెంబర్ 28కు ఎంతో చారిత్రక నేపథ్యముందని, అందుకే అదేరోజున ప్రజా పాలనకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ , శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా తొలిసారిగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన ఆమె ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రజా పాలనపై సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజా పాలనకు నాంది పలుకుతున్నామన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల సంక్షేమం,…
చెన్నైలో 28 ఏళ్ల క్రితం భార్య విడాకుల ఫిర్యాదుతో అత్తను హతమార్చిన వ్యక్తిని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు చాలారోజులుగా వెతుకుతుండగా.. మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు హరిహర్ పట్టాజోషి (51) కోసం వారం రోజులపాటు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గోసానినుగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు దాక్కున్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నట్లు బెర్హంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేక్ ఎం శరవణ…
ఈ నెల ప్రారంభంలో లోక్‌సభ సమావేశాల సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా అక్కడి నుంచి దూకి ఎంపీల మధ్యకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ 'లోతైన, చీకటి గది'గా మారిందని, భద్రతా ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి దేవేంద్రసింగ్ చౌహాన్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులతో.. Civil Supplies commissioner, DS Chauhan, telugu news, big news,
డాక్టర్ మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యప్రదేశ్‌లో పరిపాలన చాలా చురుగ్గా కనిపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. యూపీ సీఎం ఫార్ములాను ఉపయోగిస్తుంది. నర్మదాపురంలోని బిటిఐ ప్రాంతంలో రెండు రోజుల క్రితం సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులలోని…
వేర్పాటువాద నాయకుడు మస్రత్ ఆలం భట్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్ ను కేంద్రం బుధవారం 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది. అంతేకాకుండా.. UAPA చట్టం కింద ఐదేళ్లపాటు నిషేధించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)'/MLJK-MA UAPA కింద 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించబడిందని తన పోస్ట్‌లో రాశాడు. భారత దేశం యొక్క ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా…