దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కీలక పాత్రలలో నటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమాకి సంబంధించిన మొదటి భాగం 2015లో రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకోగా, రెండో భాగం 2017లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయి మొన్నటికి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో సినిమా రిలీజ్ చేయాలని టీం…
పాన్ ఇండియా చిత్రాల కల్చర్.. సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే.. నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు…
ఒకటికాదు రెండు కాదు ఏకంగా డజన్లు డజన్లు ప్లాప్ లు కొడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అయినా సరే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు చేస్తూనే ఉన్నారు. వారు కోరుకున్న పారితోషకాలు కూడా సమర్పిస్తున్నారు నిర్మాతలు. సిసినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే పదం విని ఎన్నేళ్లు అవుతుందో వాళ్ళు కూడా మరిచిపోయారు. ముఖ్యంగా నితిన్, గోపీచంద్, రామ్ పోతినేని, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగ శౌర్య ఇలా మిడ్ రేంజ్ హీరోలు వరుస ప్లాప్స్ తో దూసుకెళ్తూ …
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని 1Ta******er, 1t****v, 5M****z వంటి వెబ్సైట్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. Also…
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న శృతిహాసన్ ఇప్పుడు పెద్దగా తెలుగు సినిమాలు చేయడం లేదు. చేస్తున్న కొన్ని సినిమాలతో వార్తలో నిలుస్తున్న ఆమె ఇప్పుడు అనుహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయింది. సుమారు ఎనిమిది మిలియన్ల నుండి ఫాలోవర్స్ ఉన్న ఆమె అకౌంట్ ని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ బ్యాచ్ హ్యాక్ చేసింది. చేయడమే కాదు తమకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా…
Tamil Audience : తమిళ తంబీలు ఇక మారరా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే తమిళ హీరోల సినిమాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి వసూళ్లు సాధిస్తున్నాయో చూస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలను ఎంతో ఆదరిస్తుంటారు. కానీ మన హీరోల సినిమాలను తమిళంలో ఎంత వరకు ఆదరిస్తున్నారు. ఇది ఎప్పుడూ వినిపించే ప్రశ్న. తమిళ యావరేజ్ హీరోల సినిమాలు కూడా ఇక్కడ మంచి కలెక్షన్లు సాధిస్తుంటే.. మన స్టార్ హీరోల సినిమాలు తమిళంలో మామూలు…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సుజిత్ దర్శకత్వంలోని ఓజీ సినిమాతో పాటు బాలకృష్ణ బోయపాటి అఖండ సెకండ్ పార్ట్ సినిమా ఇప్పటివరకు అయితే ఒకే రోజు రిలీజ్ కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమా యూనిట్లు అదే విషయాన్ని ఖరారు చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్నాయి. Also Read:Kubera: ‘కుబేర’కి దేవి శ్రీ టెన్షన్!! అయితే దాదాపుగా అది అసాధ్యం అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ రెండు సినిమాల మధ్య క్లాష్…
తెలుగు సినిమా పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అడపాదడపా సూపర్ హిట్టవుతున్న సినిమాలను హైలైట్ చేస్తూ.. అట్టర్ ఫ్లాప్ అవుతున్న మెజార్టీ సినిమాల గురించి ఎవరూ ఆలోచించడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. చాన్నాళ్లుగా నిర్మాతలు క్యాషియర్లుగా మారిపోయారు. ఇక అదుపు తప్పుతున్న నిర్మాణవ్యయం, అధిక రెమ్యూనరేషన్లతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టైంది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఓవర్ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న టాలీవుడ్.. చేజేతులా సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోందనే అభిప్రాయాలున్నాయి.…
Jagga Reddy : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఆయన తన సినీ ప్రయాణం, రాజకీయ భవిష్యత్తు, అభివృద్ధి పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, మూడు నెలల క్రితం దర్శకుడు రామానుజం తన వద్దకు వచ్చి, ఒక ఫోటో చూపించారని చెప్పారు. ఆ ఫోటో చూసిన వెంటనే తనకు కనెక్షన్ కలిగిందని, 2013 నుంచి దర్శకుడు తనలాంటి వ్యక్తిని వెతుకుతున్నారని చెప్పాడని వెల్లడించారు. మొదటగా సినిమాకు సమయం ఇవ్వలేనేమో అనుకున్నా,…
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే.