Jeevitha-Rajashekar : హీరో రాజశేఖర్, జీవితలపై తాజాగా సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు వి.సముద్ర. రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహరాశి, ఎవడైతే నాకేంటి సినిమాలకు ఈయనే డైరెక్టర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను రాజశేఖర్ తో సింహరాశి మూవీని 2001లో తీశాను. అది బాగా ఆడింది. నాపై నమ్మకంతో మరో సినిమా చేయాలనుకున్నాడు రాజశేఖర్. నాకు వరుసగా ఆరు, ఏడు కథలు పంపించారు. కానీ అవి ఆడవు అని తెలిసి రిజెక్ట్ చేశా. అలా 2007లోపు ఆరు కథల దాకా వద్దన్నాను.
Read Also : Actors Re-Union : శ్రీకాంత్, అలీ బ్యాచ్ రీ యూనియన్.. ఫొటోలు వైరల్
నేను రిజెక్ట్ చేశాననే కోపం పెంచుకున్నాడు. కానీ అవి ఆడవు అని నాకు తెలుసు. చివరగా 2007లో మలయాళ హిట్ మూవీ లయన్ కథ వినమన్నాడు. సరే అని చూస్తే అది నాకు నచ్చింది. కానీ మూవీలో కొన్ని మార్పులు చేసి ఎవడైనా నాకేంటి అనే టైటిల్ తో మూవీని డైరెక్ట్ చేశా. మూవీ బాగా రావడంతో జీవిత, రాజశేఖర్ సినిమా మధ్యలో నన్ను తొలగించాలని అనుకున్నారు. డైరెక్టర్ గా వాళ్ల పేర్లు వేసుకోవాలనుకున్నారు. అందుకే సెట్స్ కు వచ్చి ఆ సీన్ బాలేదు, ఇది బాలేదు అంటూ గొడవ పడ్డారు. పేరు కోసం అయితే డైరెక్ట్ గా చెప్పండి. ఇవన్నీ ఎందుకు కావాలంటే మీ పేరే వేసుకోండి అని చెప్పి బయటకు వచ్చేశా. ఆ సినిమా మధ్యలో ఆగిపోతుందని ఇండస్ట్రీ పెద్దలు చెప్పడంతో వాళ్లు నన్ను రిక్వెస్ట్ చేశారు. దీంతో నేనే సినిమాను కంప్లీట్ చేశా. ఆ మూవీ బాగా ఆడింది. జీవిత, రాజశేఖర్ పై నాకు కోపం లేదు. వాళ్లు మంచివాళ్లే. కానీ పేరు కోసం అలా చేయడం వల్లే మాకు గొడవ అయింది అన్నారు సముద్ర.
Read Also : Tollywood : సీఎం రేవంత్ ను కలిసిన నిర్మాతలు, డైరెక్టర్లు