తెలుగు సినిమా ఇండస్ట్రీ (టాలీవుడ్) రేంజ్ రోజురోజుకీ మారిపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ మీద దృష్టి పెట్టకుండా, మంచి రెమ్యునరేషన్ ఇస్తే చాలు.. డేట్స్ ఇచ్చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో తమిళ స్టార్స్ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.
Also Read:Allu Arjun : అట్లీ మూవీలో యానిమేటెడ్ రోల్ చేస్తున్న బన్నీ..?
తమిళ హీరోల టాలీవుడ్ ఎంట్రీ
తమిళ హీరోల టాలీవుడ్ ఎంట్రీ ఇప్పటిది కాదు. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ పరిశీలిస్తే తమిళ హీరో ధనుష్ ఇప్పటికే టాలీవుడ్‌లో తన మార్క్ చూపించాడు. దర్శకుడు వెంకీ అట్లూరితో ‘సార్’ సినిమాతో హిట్ కొట్టిన ధనుష్, ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే, ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్‌తో ఓ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మరోవైపు, తమిళ స్టార్ సూర్య కూడా వెంకీ అట్లూరీతో ఓ సినిమా లాంచ్ చేశాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌తో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం. ఇంతకుముందే వంశీ పైడిపల్లి తమిళ స్టార్ విజయ్‌తో ‘వారిసు’ సినిమా చేశాడు. ఈ సినిమా తెలుగులో ఆడకపోయినా, తమిళంలో మంచి విజయం సాధించింది. అలాగే, శివ కార్తికేయన్‌తో అనుదీప్ ‘ప్రిన్స్’ అనే సినిమా చేశాడు, కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Also Read:Deepika: స్పిరిట్ లో అవుట్.. బన్నీ సినిమాలో ఇన్?
కథ వద్దు రెమ్యునరేషనే ముద్దు?
తమిళ హీరోలు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న తీరు చూస్తే, కథ కంటే రెమ్యునరేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలుగు స్టార్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు సినిమాలతో బిజీగా ఉంటూ, కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ, తమిళ హీరోలు మాత్రం కథ, దర్శకుడు సంగతి ఎలా ఉన్నా మంచి రెమ్యునరేషన్ దొరికితే సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. దీంతో వారు చేసే సినిమాల్లో కొన్ని హిట్ అవుతుంటే, మరికొన్ని బోల్తా కొడుతున్నాయి.
తెలుగు హీరోలు రిజెక్ట్ చేసిన కథలే?
టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, తమిళ హీరోలు ఒప్పుకుని చేస్తున్న సినిమాలు చాలావరకు తెలుగు హీరోలు రిజెక్ట్ చేసిన కథలే అని టాక్. తెలుగు హీరోలు కథల ఎంపికలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుండగా, తమిళ హీరోలు మాత్రం వేగంగా సినిమాలు చేస్తూ, రెమ్యునరేషన్‌పై ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే, మరికొన్ని ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ క్రమంలో తమిళ హీరోలు టాలీవుడ్‌లో సినిమాలు చేయడం పెరిగినా, వారి ఫోకస్ కథ కంటే రెమ్యునరేషన్‌పైనే ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, వారి సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతవరకు సక్సెస్ అవుతున్నాయి. ఇకముందు తమిళ హీరోలు టాలీవుడ్‌లో ఎలాంటి సినిమాలు చేస్తారు, ఎంతవరకు విజయం సాధిస్తారనేది చూడాలి.