ఈ రోజు జరిగిన ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ కానున్నాయి. ఇప్పటికే రన్నింగ్లో ఉన్న సినిమా షూటింగ్లు కుడా జరగవు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తెలుగు చిత్రసీమలో సమ్మె వివాదం ఓ కొలిక్కి వచ్చింది. నిన్న ఈ రోజు సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చొరవతో ఈ రోజు సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపామని తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ తెలిపారు. వేతనాలు ఏ మేరకు పెంచాలనే విషయంలో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ‘దిల్’ రాజు నేతృత్వంలో కో-ఆర్డినేషన్ కమిటీని వేశామని, వారు రేపు ఉదయం…
రెండేళ్ల పాటు కరోనా కారణంగా కుదేలైన సినిమా రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే ఇంతలోనే కొత్త సమస్యలు కొన్ని చిత్రసీమను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఫిల్మ్ ఫెడరేషన్లోని 24 క్రాఫ్టులకు సంబంధించిన వేతనాలను సవరించాల్సి ఉండటంతో వారు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. వెంటనే వేతనాలను పెంచకపోతే, జూలై 1వ తేదీ నుంచి యూనియన్లు సమ్మె బాట పట్టినా ఆశ్చర్యం లేదని ఫెడరేషన్ పెద్దలు కొందరు చెబుతున్నారు. సమ్మె నోటీస్ను ఫెడరేషన్ ఇటు ఫిల్మ్…
ఇప్పుడు మన తెలుగు చిత్రసీమ ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చెలాయిస్తుండడమే కాదు.. ప్రపంచ స్థాయి సినిమాలకు కూడా ధీటుగా పోటీనిస్తోంది. ఉన్నత ప్రమాణాలతో రూపొందుతూ.. విశేష ఆదరణను చూరగొనడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త మైలురాళ్ళనే సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు విదేశాల్లోనూ ఎలా అలజడి సృష్టించాయో అందరూ చూశారు. ఆర్ఆర్ఆర్ అయితే కొన్ని ‘ద బ్యాట్మాన్’ సినిమానే వెనక్కు నెట్టేసింది. అలాంటి మన టాలీవుడ్పై భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ…
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం… టికెట్ల వివాదంతో పాటు మరికొన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపించింది.. దీనిపై స్పందించిన సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు సన్మానం చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు.. అయితే, సినీ ఇండస్ట్రీ పెద్దల వైఖరిని తప్పుబట్టారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న ఆయన..…
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ – 24 క్రాఫ్ట్స్ మరియు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కలసి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలను చర్చించటానికి ఇటీవల జి. ఆదిశేషగిరి రావుఅధ్యక్షతన సమావేశమైంది. చిత్ర పరిశ్రమలోని వివధ శాఖలకు చెందిన సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలలోని అడ్మిషన్…
సినిమా టికెట్లతో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన ఇతర సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా కొనసాగగా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముందుండి పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమ తరపున ముందుడి.. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు.. ఇక, సీఎం జగన్తో ప్రత్యేకంగా సమావేశమైన చర్చించారు.. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కూడా వెళ్లి సమస్యల…
“కళ్ళ కింద క్యారీ బ్యాగులు…” ఉంటేనేం, కామెడీతో కబడ్డీ ఆడగలిగే సత్తా ఉంటే చాలు, నందులు నడచుకుంటూ రావలసిందే! అంతటి ధీమాతోనే ఎమ్.ఎస్.నారాయణ నవ్వులు పూయించారు. అందువల్లే ఎమ్మెస్ నారాయణను ఐదు సార్లు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డులు వరించాయి. ఎమ్మెస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు, అసంకల్పితంగా ప్రేక్షకుల పెదాలు విచ్చుకొనేవి. ఇక ఆయన కదిలితే చాలు జనానికి చక్కిలిగింతలు కలిగేవి. నోరు విప్పి మాట్లాడితే కితకితలే! పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో 1951…