Gaddar Awards: తెలుగు చిత్రసీమలో మరోసారి సినీ అవార్డులతో వేదిక వెలుగులు నింపనుంది. 14 సంవత్సరాల విరామం తర్వాత ఉత్తమ తెలుగు సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఒక మహత్తరమైన గౌరవంగా భావిస్తున్నారు తెలంగాణ సినీ ప్రేమికులు. ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేశారు.
Read Also: Pawan Kalyan OG: మరోసారి OG సినిమా పోస్ట్‌పోన్ తప్పదా..? అసలు విషయం ఏంటంటే..!
ఇక తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా ఈ కార్యక్రమానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు (మే 29) ఉదయం 10 గంటలకు గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు జయసుధ, దిల్ రాజు. తెలంగాణ సినీ రంగ అభివృద్ధికి ఇది కీలకమైన అడుగుగా భావిస్తోంది చిత్ర్రా పరిశ్రమ. ఉత్తమ నటన, దర్శకత్వం, సంగీతం తదితర విభాగాల్లో పురస్కారాలు అందించనున్న ఈ కార్యక్రమం చిత్రసీమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also: Seetha Payanam: తండ్రి డైరక్షన్‌లో హీరయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కూతురు.. టీజర్ రిలీజ్..!