తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) సభ్యులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమ్మె సందర్భంగా, ఫిల్మ్ చాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు సభ్యులు ఎటువంటి చర్చలు లేదా సంప్రదింపులు చేయకూడదని స్పష్టమైన నిర్దేశించింది. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని యూనియన్లు, తమ డిమాండ్లు మరియు సమస్యలపై చర్చలు లేకుండా ఏకపక్షంగా సమ్మెకు…
టాలీవుడ్ లో గత ఐదు రోజులుగా షూటింగ్స్ లేక మూగబోయింది. వేతనాల పెంపుపు పై కార్మిక సంఘాలకు, ఫిల్మ్ ఛాంబర్ కు మధ్య మొదలైన వివాదం బంద్ కు దారి తీసింది. ఈ విషయమై ఈ రోజు పలువురు చిన్న సినిమా నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీ. కళ్యాణ్ : చిన్న సినిమాల నిర్మాతలతో సమావేశం నిర్వహించాము. చిన్న నిర్మాతలు మార్కెటింగ్ లేక థియేటర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.…
సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరుగా ఉన్న టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ సమస్య మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజానికి తమకు వేతనాలు పెంచి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్న ఆయన, స్కిల్డ్ వర్కర్స్ లేనప్పుడు ఇప్పుడు ఇస్తున్న వేతనాలే ఇబ్బందికరంగా అనిపిస్తోందని అన్నారు. అలాంటిది స్కిల్ లేకుండా ఇప్పుడు ఇంకా జీతాలు పెంచి వాళ్లకు ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతుందని…
టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించిన ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. సినిమాలకు పని చేసే వివిధ క్రాఫ్ట్స్ లోని కార్మికుల రోజు వారి వేతనాలను (30%) పెంచి ఇచ్చిన వారికి రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొంటామని తేల్చి చెప్పిన ఫెడరేషన్ నాయకులు. కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలనే నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది. దాంతో నిబంధనలకు అనుగుణంగా వేతనం…
Tollywood : టాలీవుడ్‌లో వేతనాల పెంపుపై ఉత్కంఠ పెరిగింది. ఫెడరేషన్ రేపటి నుంచి 30% వేతనాలు పెంచితేనే షూటింగ్లకు హాజరవుతామని, లేనిపక్షంలో బంద్ ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ నుండి అధికారిక ప్రతిస్పందన వచ్చింది. చాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ఒక లేఖ విడుదల చేసి ఫెడరేషన్ నిర్ణయాన్ని ఖండించారు. Top Headlines @9PM : టాప్ న్యూస్ ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తోందని దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.…
Film Chamber : హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు గొడవకు దిగారు. ఫిలిం ఛాంబర్ లో పైడి జయరాజ్ ఫొటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాశం యాదగిరి వాగ్వాదానికి దిగారు. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. కావాలనే తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫొటోను చిన్నగా పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. ఈ విషయం తెలుసుకున్న…
తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు త్వరలోనే నిర్వహించాలని కోరుతూ రేపు తెలుగు ఫిలిం చాంబర్ హాల్‌లో కొంతమంది నిర్మాతలు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నిర్మాతలు కేఎస్ రామారావు, సి కళ్యాణ్, అశోక్ కుమార్, బసిరెడ్డి వంటి వారు ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడబోతున్నారు. నిజానికి ఈ అంశం మీద ఈ నెల రెండో వారంలోనే నిర్మాతలు సమావేశం అయ్యారు. ఏడాది జులైలో జరగాల్సిన చాంబర్ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జులైతో ప్రస్తుత…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో నేడు ‘అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు…
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పర్సంటేజీ విధానం లెక్కన సినిమాలాడించాలా లేక రెంటల్ విధానం లెక్కన ఆడించాలా అనే విషయం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లందరూ ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ఆడించాలని లేదంటే థియేటర్లో మూసేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది. Also Read:Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..? ఈ కమిటీలో సభ్యులుగా కేఎల్…
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వ కాలంలో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై విచారణ కోసం ఆయన సోమవారం ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారుల ముందు హాజరయ్యారు. భరత్ భూషణ్ ఫోన్ టాపింగ్ వ్యవహారం గత ఎన్నికల సమయంలో జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఎన్నికలకు…