తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 30% వేతన పెంపు డిమాండ్‌తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన సమ్మె కారణంగా టాలీవుడ్ షూటింగ్స్ పూర్తిగా స్తంభించాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసి, ఫెడరేషన్ యూనియన్లతో సంప్రదింపులు నిషేధించింది. ఈ రోజు ఉదయం ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నాయకులు సమావేశమై, సమ్మె కొనసాగింపుపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య జరిగిన కీలక భేటీలో నిర్మాతల ప్రతిపాదనలపై చర్చ జరిగింది.
Also Read : ’పెద్ది’ కోసం కీలక వ్యక్తిని తీసుకొచ్చిన రామ్ చరణ్
అనంతరం ఫెడరేషన్ సభ్యులు సీనియర్ నటుడు చిరంజీవిని ఆయన నివాసంలో కలిసారని, సమస్యను పరిష్కరించుకోవాలని చిరంజీవి సూచించినట్లు కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు, ఈరోజు ఫెడరేషన్ సభ్యులు ఎవరూ మెగాస్టార్ చిరంజీవి గారిని కలవలేదు అని ఆయన టీం స్పందించింది.మరోపక్క ఫెడరేషన్ కార్మికులు 30% వేతన పెంపు, రోజువారీ చెల్లింపులపై గట్టిగా ఉన్నారు. చర్చలు విఫలమైతే, రేపు (ఆగస్టు 10) ఫెడరేషన్ ఆఫీసు నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి సలహాతో సమస్య త్వరలో పరిష్కారమవుతుందని పరిశ్రమ ఆశిస్తోంది.