Tollywood : తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. వేతనాల పెంపు డిమాండ్‌తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన అప్రకటిత సమ్మె కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి ఫెడరేషన్ యూనియన్లతో సంప్రదింపులు జరపవద్దని స్పష్టం చేసింది. ఈ రోజు ఉదయం ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నాయకులు సమావేశమై, సమ్మె కొనసాగింపు, వేతనాల పెంపు అంశంపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య మరో కీలక భేటీ జరగనుంది.
Read Also : Mahesh Babu : సౌత్ లో ఏకైక హీరోగా మహేశ్ బాబు రికార్డ్.. ఎందులో అంటే..?
ఈ సమావేశంలో నిర్మాతలు ముందుకు తెచ్చిన నాలుగు ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. ఈ ప్రతిపాదనలు అంగీకారయోగ్యమైతే, కార్మికులు కోరిన 30 శాతం వేతన పెంపు అంశంపై స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. కార్మికులు మాత్రం తమ రెండు ప్రధాన డిమాండ్లపై గట్టిగా ఉన్నారు: 30 శాతం వేతన పెంపు మరియు పెంచిన వేతనాలను రోజుకు రోజు చెల్లించాలని. ఈ డిమాండ్లకు నిర్మాతలు లిఖితపూర్వక హామీ ఇస్తేనే షూటింగ్‌లకు హాజరవుతామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ రోజు జరిగే చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే, రేపు (ఆగస్టు 10) ఫెడరేషన్ ఆఫీసు నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేసే ఆలోచనలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఫెడరేషన్ నాయకులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరియు సీనియర్ నటుడు చిరంజీవిని కలిసి సమస్యను వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు.
Read Also : Murder : చెల్లెలి మీద ప్రేమ.. బావను మర్డర్ చేసిన బామ్మర్దులు