హైదరాబాద్ శిల్పకళా వేదికలో నేడు ‘అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని
నార్కోటిక్ అధికారులను కోరారు.
Also Read:Vijay Deverakonda: డ్రగ్స్ వల్ల మనిషికి చాలా ముఖ్యమైనవన్నీ దూరమవుతాయి!
మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే విధానం అమలులో ఉందని, అదే తరహాలో టాలీవుడ్‌లో కూడా ఇటువంటి నిర్ణయాన్ని త్వరలో అమలు చేసేందుకు TFDC ద్వారా చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో సంప్రదింపులు జరిపి, అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం ప్రతిజ్ఞ చేద్దాం అని దిల్ రాజు అన్నారు. రేవంత్ తో ఫ్లైట్ లో వైజాగ్ నుండి హైదరాబాద్ వస్తుంటే తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేయాలి అని చెప్పారు. చిన్నపిల్లల వరకు డ్రగ్స్ వెళ్లాయి, దాన్ని నిర్మూలించాలి అని అన్నారు. నేను ప్రమాణం చేస్తున్న, నేను.. నా కుటుంబం.. మా సన్నిహితులు ఎవరు డ్రగ్స్ తీసుకోరు అని ఆయన అన్నారు.