Sajjala Ramakrishna Reddy comments on chandrababu: వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అంటూ ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. పరామర్శ కంటే ప్రచారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని.. చంద్రబాబు మురికి రాజకీయానికి గురువారం నాటి ఘటనే సాక్ష్యమన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకృతి…
Vijaya Sai Reddy Comments on Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. గురువారం నాడు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పడవ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ తాజాగా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా బాబూ? పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో…
Chandra Babu Fires on YCP Leaders: ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిపక్షాలు శ్రీలంకతో పోల్చడంపై వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులే ఏపీలో ఉన్నాయని.. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని, తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని…
ycp leader pothula sunitha counter to vangalapudi anitha: టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితపై వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ సతీమణి గురించి మాట్లాడే హక్కు అనితకు లేదని పోతుల సునీత వ్యాఖ్యానించారు. మహిళలను నమ్మించి మోసం చేసే పార్టీ టీడీపీ అని.. అనిత కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతోందని పోతుల సునీత మండిపడ్డారు. భారతి అంటే అనితకు భయం ఉండటం సహజం…
Tdp cheif chandrababu comments on helping to Flood victims: గోదావరి నదికి వచ్చిన వరద ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ వరద కారణంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రీతిలో సెటైర్లు వేశారు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగంటే నాలుగే.. ఇది…
Kodali Nani Fires on TDP And Janasena: వరదలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడంపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన రీతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గోదావరి వరద ప్రాంతంలో సీఎం జగన్ పునరావాసం ఏర్పాటు చేశారని కొడాలి నాని వెల్లడించారు. బాధితులకు ఆహారం, నీరు అందించడం సహా కుటుంబానికి రూ.2 వేలు ఇచ్చారన్నారు. వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఒక్కో కలెక్టర్‌కు…
Chandra Babu Fires on AP Government: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. కోవిడ్ నిధులనూ దారి మళ్ళించడం మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనమని చంద్రబాబు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించిందని చంద్రబాబు వివరించారు. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని.. దారి మళ్లించిన నిధులను వెంటనే SDRF ఖాతాలో జమ చెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ ఇష్టానుసార…
Telugu Desam Party Leader Devineni Uma: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంచడానికి ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాఫర్ డ్యాం ఎత్తు పెంచడానికి పీపీఏ అనుమతిచ్చిందా లేదా సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ చెప్పారంటూ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచేస్తామని మంత్రి అంబటి రాంబాబు చెప్పడం…