ప్రస్తుతం యావత్ సినీ అభిమానులందరూ రెండు సినిమాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయ్యే మోస్ట్ అవైటెడ్ మూవీస్ కెజిఎఫ్ 2 ఒకటి కాగా దీనికి పోటీగా వస్తున్న బీస్ట్ ఒకటి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో అని ప్రతి ఒకరు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే కెజిఎఫ్ 2 టీమ్ దేశం అంతా తిరిగి అభిమానుల అటెన్షన్ గ్రాఫ్ చేస్తుంటే కోలీవుడ్ హీరో విజయ్ మాత్రం ఒక్క…
కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాతోనే చిత్ర పరిశ్రమనే తన అభిమాని గా మార్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈ చిత్రబృందం తెలుగు రాష్ట్రాల్లో మెరుపు వేగంగా తిరుగుతున్నారు. ఇక…
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కాఠిన్యం మరోసారి బయటపడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారు సామాన్యులు అయినా సెలబ్రిటీలు అయినా వారిని ఆపి జరిమానా విధిస్తూ తమ్ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచు ట్రాఫిక్ పోలీసులు టింటెడ్ గ్లాస్ నిబంధనను ఉల్లంఘిస్తున్న వారిపై నిఘా పెట్టిన విషయం తెలిసిందే.. ఇందులో ఎక్కువ సెలబ్రిటీలు ఉండడం విశేషం. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్లను అడ్డుకొని కార్లకు ఉన్న బ్లాక్ఫిల్మ్ ను తొలగించి,…
హైదరాబాద్ లోనే ఉంటూ కోరుకున్న ప్రదేశంలో చిత్రీకరణ జరుపుతున్నట్టు భ్రమింప చేస్తున్న రోజులివి. ‘వర్చువల్ టెక్నాలజీ’తో ఇప్పటికే మీడియా ఈ దిశగా సాగుతూ పలు ప్రయోగాలు చేస్తోంది. సినీజనం కూడా అదే బాటలో పయనిస్తూ వర్చువల్ ప్రొడక్షన్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. సృజనాత్మకత కలిగిన ఎందరో దర్శకులు, నిర్మాతలు ఈ వర్చువల్ ప్రొడక్షన్ ద్వారా తమ ప్రాజెక్ట్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం కొందరు విదేశాలకు పరుగులు తీసి వర్చువల్ గా తమ…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఏ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న…
ప్రస్తుతం సినిమా ఎలా ఉంది అన్నదానికన్నా ఆ సినిమా ప్రమోషన్స్ ఎలా చేశారు అనేదాని గురించే ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావాలంటే ముందు దానికి ప్రమోషన్స్ చేసి జనాలలో ఆ పేరును నానిస్తే అప్పుడు ఆ ప్రొడక్ట్ విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీశామన్నది కాదు ప్రమోషన్స్ కి ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాం అనేది ముఖ్యం అంటున్నారు…
‘ఆర్ఆర్ఆర్’ సందడి సద్దుమణుగుతోంది. ‘కెజిఎఫ్-2’ హీట్ మొదలైంది. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది. ఇక దీనికి పోటీగా ఓ రోజు ముందు ‘బీస్ట్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో దేనికి ఆదరణ దక్కుతుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్. వరుస విజయాలతో కోలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుగున్న విజయ్ ‘బీస్ట్’లో హీరో కాగా, లక్కీ బ్యూటీ కన్నడ కస్తూరి పూజా హెగ్డే కథానాయిక. నెల్సన్ దిలీప్ కుమార్…
తెలుగు ఇండియన్ ఐడిల్ 14వ ఎపిసోడ్ సైతం సరదా సరదాగా సాగిపోయింది. శుక్రవారం తమన్, నిత్యామీనన్, కార్తీక్ సినిమాలకు సంబంధించిన పాటలు పాడిన కంటెస్టెంట్స్… శనివారంఈ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ మూవీ సాంగ్స్ పాడి అలరించారు. మొదటగా వచ్చిన శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘తొలిప్రేమ’లోని ‘నింగిలా నిన్నిలా చూశానే’ పాటతో బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని వోకల్ కార్డ్స్ కు ఏమైనా అయిపోతుందేమోననే భయం వేస్తోందని, అద్భుతమైన పిచ్ లో…
విశాల్ హీరోగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’. ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్ గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ కనిపించాడు. శరీరమంతా గాయాలతో పాటు భవనం నుండి లేజర్…